తెలివి తేల్లారింది! అక్షరదోషం: విమానాన్నే పేయింట్ షాప్‌కు పంపించారు

హాంకాంగ్: టూ వీలర్స్ లేదా కార్లు లాంటి వాటిలో ఏదైనా నెంబర్ లేదా అక్షరదోషం కనిపిస్తే ఎక్కడైతే పేయింట్ వేయించామో.. అక్కడకు వెళ్తాం. కానీ ఏకంగా ఓ విమానాన్ని పేయింట్ షాప్‌కు తీసుకు వెళ్లడం గమనార్హం. ఈ సంఘటన హాంగ్‌కాంగ్‌లో జరిగింది. విమానంపై రాసిన పేరులో అక్షరదోషం కనిపించింది.

హాంగ్‌కాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆ విమానం ఉండగా ప్రయాణీకులు కొందరు దానిని గుర్తించారు. ఎయిర్ లైన్స్ వారికి సమాచారం ఇచ్చారు. ఆ జెట్ విమానంలో ఓ వైపు.. కాథే పసిఫిక్‌కు బదులు కాథే పసిక్ (Cathay Pacific బదులు Cathay Paciic) అని ఉంది.

Cathay Pacific spells own name wrong on side of plane

ఎయిర్ లైన్స్ విమానం పేరులోని తప్పును చిన్న కవర్‌తో అతికించి, దానిని మళ్లీ పేయింట్ దుకాణంకు పంపించారు. ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 'విమానం పైన ఉన్న ప్రత్యేక కవర్ ఇక ఉండదని, ఎందుకంటే దానిని తిరిగి పేయింట్ షాప్‌కు పంపిస్తున్నామని' కంపెనీ పేర్కొంది.

ఈ తప్పిదాన్ని ఎయిర్ లైన్స్ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ అధికారులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానంపై పూర్తి పేరు రాసేందుకు స్థలం సరిపోలేదని ఓ అధికారి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+