వీడియో: భారీ నక్షత్రాన్ని కబళించిన కృష్ణబిలం: అద్భుతాన్ని ఆవిష్కరించిన నాసా
న్యూయార్క్: అంతరిక్షం.. అద్భుతాలకు నిలయం. అంతు చిక్కని బ్రహ్మపదార్థం. అనంత విశ్వంలో ఏం జరుగుతోందనే విషయంపై శాస్త్రవేత్తలు తమ బుర్రలకు పదును పెట్టి దశాబ్దాల తరబడి పరిశోధనలు చేస్తున్నప్పటికీ.. తెలుసుకున్నది గోరంతే. అలాంటి అంతు లేని, లోతు ఎంతో తెలియని పదార్థమే కృష్ణబిలం (బ్లాక్ హోల్). భూమితో పోల్చుకుంటే కృష్ణ బిలం గురుత్వాకర్షణ శక్తి ఎన్నో రెట్లు అధికం అని, ఎంత భారీ నక్షత్రాన్నయినా తనలో కలిపేసుకునేంత శక్తి దానికి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. చెప్పడమే గానీ అలాంటి దృశ్యాలేవీ ఇప్పటిదాకా ఎవరి కంటా పడలేదు.

నక్షత్రాన్ని కబళించిన కృష్ణబిలం
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తాజాగా అలాంటి అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఓ భారీ నక్షత్రాన్ని కృష్ణ బిలం కబళించడాన్ని చిత్రీకరించింది. రోదసీలోకి నాసా పంపించిన ట్రన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ సహాయంతో దీన్ని కెమెరాలో బందించారు నాసా శాస్త్రవేత్తలు. ఈ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ఓ సరికొత్త విషయాలను దీని ద్వారా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కృష్ణబిలం తీరు ఎలా ఉంటుందనే విషయాన్ని విశ్లేషిస్తున్నారు.

375 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో..
మన సౌర మండలానికి అవతల ఈ ఘటన చోటు చేసుకుంది. భూమి నుంచి సరిగ్గా 375 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఓ భారీ నక్షత్రాన్ని కృష్ణబిలం కబళించిన దృశ్యాలు నాసా టెలిస్కోప్ లో నమోదయ్యాయి. ప్రారంభం నుంచి చివరి వరకూ ప్రతి క్షణాన్ని ట్రన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ బంధించింది. వైశాల్యంలో దాదాపు సూర్యుడితో సమానంగా ఉండే ఆ నక్షత్రం నుంచి వెలువడే తరంగాలను కృష్ణబిలం గ్రహించడం ఈ వీడియోలో చూడొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. నల్లగా ఉండే కృష్ణబిలం చుట్టూ గ్యాస్ అలముకుని ఉండటం, క్రమంగా అది కృష్ణబిలాన్ని కేంద్రంగా చేసుకుని పరిభ్రమించడం, క్రమంగా కనుమరుగు కావడం వంటి దృశ్యాలు ఇందులో ఉన్నాయని అన్నారు. ఈ తరహా అరుదైన సంఘటనలు తమ కంటికి చిక్కడా దాదాపు అసాధ్యమని పేర్కొన్నారు.

యాదృశ్చికంగా..
అంతరిక్షంలో సరికొత్త గ్రహాలను అన్వేషించడానికి నాసా శాస్త్రవేత్తలు ప్రయోగించిన ఉపగ్రహం ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్. పాలపుంతకు అవతల, ఇప్పటిదాకా ఉనికిలో లేని గ్రహాలను కనుగొనడానికి ప్రయోగించారు. కొత్త గ్రహాల కోసం అన్వేషిస్తోన్న క్రమంలోనే.. ఈ దృశ్యం ట్రాన్సిటింగ్ శాటిలైట్ కెమెరాలో నమోదైందని థామస్ హోలొయిన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. నక్షత్రం అంతరించి పోయేంత వరకూ ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయని, అంతరిక్ష పరిశోధనల్లో ఇదొక మలుపుగా మారుతుందని అన్నారు. ఈ వీడియోల ద్వారా కృష్ణబిలం గురించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడానికి అవకాశం చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications