• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనాలో ప్రమాదం: కారు నుజ్జునుజ్జు, ఐనా బతికిన జంట (వీడియో)

|

బీజింగ్: చైనాలో షాకింగ్ ప్రమాదం నుంచి ఓ జంట బయటపడింది. వేగంగా వేస్తున్న ఓ సిమెంట్ ట్రక్.. ఇద్దరు వెళ్తున్న కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదాన్ని చూస్తే అందులోని వారు చనిపోయి ఉంటారని భావిస్తారు. కానీ అదృష్టవశాత్తు అందులోని జంట బతికి బయటపడింది.

ఈ సంఘటన చైనాలోని నింగ్‌బో సిటీలో జరిగింది. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఓ కారు ఇవతలి రోడ్డు నుంచి అవతలి రోడ్డుకు వెళ్లి మలుపు తిరుగుతోంది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్కు దానిని వేగంగా ఢీకొంది.

కారును ఢీకొట్టిన ట్రక్కు కూడా బోల్తా పడింది. కారు మొత్తం తుక్కుతుక్కు అయింది. కారు శిథిలాల్లో చిక్కుకుపోయిన జంటను స్థానికులు, పోలీసులు రక్షించారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెకు సర్జరీ చేశారు. మరో వ్యక్తికి గాయాలైనా, పెద్దగా ప్రమాదం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
A man and woman survived a dramatic crash on Monday when their car was crushed by a cement tanker in southern China’s Ningbo City, according to state broadcaster CCTV.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X