ఎయిర్ పోర్ట్‌లో రాయబారిపై దాడి: సిసి కెమెరాల్లో.. (వీడియో)
కౌలాలంపూర్: కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంక రాయబారి ఇబ్రహీం సాహిబ్ అన్సార్ పైన దుండగులు దాడికి పాల్పడ్డారు. విమానాశ్రయంలో భద్రత ఉన్నప్పటికీ రాయబారి పైన దాడి జరగడం గమనార్హం. వెంటనే స్పందించిన పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు.
శ్రీలంక రాయబారి పైన జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. విమానాశ్రయంలో ఆయన నడుచుకుంటూ వెళ్తుండగా.. అకస్మాత్తుగా కొందరు అతని వద్దకు వచ్చి అడ్డుకున్నారు. వెంటనే అతని పైన పిడిగుద్దులు కురిపించారు.
అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని గుంపును చెదరగొట్టారు. ఈ సంఘటన ఆదివారం నాడు జరిగింది. ఈ ఘటనలో శ్రీలంక రాయబారి స్వల్పంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఇబ్రహింపై వారు ఎందుకు దాడి చేశారనే విషయం తెలియాల్సి ఉంది. తమ రాయబారిపై దాడి చేయడంపై శ్రీలంక విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశ అధికారులకు రక్షణ కల్పించడంలో మలేసియా అధికారులు విఫలమయ్యారని పేర్కొంది.
ఘటనపై వెంటనే విచారణ జరిపించి, తమ దౌత్యబృందానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. అంతకుముందు, శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద్రా రాజపక్సే మలేసియా వెళ్లిన సందర్భంలోనూ వందల మంది నిరసనకారులు కౌలాలంపూర్‌లో ఆందోళన చేపట్టారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications