వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓయ్ బామ్మా ఏక్‌ పెగ్‌లా : కరోనాపై విజయం సాధించిన వందేళ్ల గ్రానీ..బీర్‌తో సెలబ్రేషన్స్..!

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. దాదాపు 200కు పైగా దేశాలను గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి బారిన పడి... ఇప్పటికే 3 లక్షల మందికి పైగా మృతి చెందారు. ఇంకా చాలామంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో రోజూ మరణమృదంగమే మోగుతోంది. అక్కడ అంతలా ఈ రాకాసి మహమ్మారి విరుచుకుపడుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే హాస్పిటల్స్ అన్నీ కరోనావైరస్ పేషెంట్లతో హౌజ్ ఫుల్ అయ్యాయి. ఇక కోలుకుంటున్నవారు కోలుకుంటున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వృద్ధులకు సోకిన కరోనావైరస్ నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారు అతి తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో అమెరికాకు చెందిన ఓ వందేళ్ల బామ్మ కూడా ఉన్నారు. కరోనావైరస్‌ను జయించిన ఈ బామ్మ ఎలా సెలబ్రేట్ చేసుకుంటుందో తెలిస్తే సర్‌ప్రైజ్ అవుతారు.

భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..

 103 ఏళ్ల బామ్మకు కరోనావైరస్

103 ఏళ్ల బామ్మకు కరోనావైరస్

ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న బామ్మ పేరు జెన్నీ స్టెజ్నా. వయస్సు వందేళ్లు అక్షరాలా చెప్పాలంటే 103 ఏళ్లు. అప్పటివరకు చాలా ఆరోగ్యంగా ఉన్న ఈ బామ్మను కరోనావైరస్ కాటేసింది. దీంతో ఈ బామ్మ వయస్సు చూస్తే ఇక బతకరని చాలామంది భావించారు. అయితే జెన్నీ స్టెజ్నా మాత్రం అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ అనూహ్యంగా ప్రాణాలతో బయటపడింది. కరోనావైరస్‌పై విజయం సాధించింది.

 ఎక్కడా ధైర్యం కోల్పోని బామ్మ

ఎక్కడా ధైర్యం కోల్పోని బామ్మ

మూడు వారాల క్రితం జెన్నీకి కరోనావైరస్ సోకింది. అయితే ఎక్కడా అధైర్య పడలేదు. వృద్ధులకు సోకితే దాదాపు ప్రాణాలతో బయటపడరనే నగ్న సత్యం తెలిసినప్పటికీ ఈ వందేళ్ల బామ్మ మాత్రం అధైర్య పడలేదు. తప్పకుండా విజయం సాధిస్తాననే గట్టి నమ్మకం చివరివరకు ఉన్నింది. ఆమెను హాస్పిటల్‌లో చేర్పించిన వారి కుటుంబ సభ్యులకే బామ్మ బతికి బయట పడుతుందన్న నమ్మకం లేదు. కానీ ఆమె అనూహ్యంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇక హాస్పిటల్‌లో చేరిన సమయంలో స్టెజ్నా పరిస్థితి విషమించింది. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. ఇక బయట ఉండి ఈమె ఆరోగ్యపరిస్థితి గమనిస్తున్న వారు అప్పటికే తమ బంధువులకు ఈమె బతికే అవకాశం లేదని చివరిసారిగా చూసేందుకు రండి అంటూ కబురు పంపారు.

Recommended Video

IPL 2020 Happening This year In One Venue With 3 or 4 Grounds
 విజయం సాధించింది..బీర్‌తో సెలబ్రేట్ చేసుకుంది

విజయం సాధించింది..బీర్‌తో సెలబ్రేట్ చేసుకుంది

చనిపోతే స్వర్గానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించగా అందుకు ఈ బామ్మ నేను చనిపోతున్నానని ఎవరూ చెప్పారు..? కచ్చితంగా ఈ మహమ్మారిపై విజయం సాధిస్తాననే ఆత్మ విశ్వాసం వ్యక్తం చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక తమ బామ్మ పూర్తిగా కోలుకున్నారని హాస్పిటల్ వర్గాలు మే 13న సమాచారం ఇచ్చినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఇక సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన బామ్మ ఒక చిల్డ్ బీర్‌తో సెలబ్రేట్ చేసుకుంది. బీర్ అంటే బామ్మకు చాలా ఇష్టం. అయితే గత కొద్దిరోజులుగా ఆమె వైరస్ బారిన పడటంతో ఈ బీర్‌కు దూరంగా ఉంది. ఇదిలా ఉంటే ఈ బామ్మకు ఇద్దరు పిల్లలు, ముగ్గురు మనవళ్లు మనవరాండ్లు, నలుగురు మునిమనవళ్లు మనవరాండ్లు ఉన్నారు.

English summary
103-year-old Massachusetts woman recovers from coronavirus celebrates with a chilled beer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X