ఆపరేషన్ సిందూర్ పై పాక్ కు ముందే హింట్ ? రాహుల్ షాక్ తో కేంద్రం క్లారిటీ..!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినప్పటికీ దీన్ని డీల్ చేసిన కేంద్రం మాత్రం ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ ను తాము ముందుగానే హెచ్చరించినట్లు విదేశాంగమంత్రి జై శంకర్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ రాహుల్ గాంధీ ఎక్స్ లో పెట్టిన పోస్టు కలకలం రేపింది. దీంతో విదేశాంగశాఖ ఇవాళ రాహుల్ వ్యాఖ్యలపై స్పందించింది.

ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ కు ముందుగానే చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని, దీని వల్ల మన యుద్ద విమానాలు ఎన్ని కోల్పోయామో చెప్పాలంటూ విదేశాంగమంత్రి జైశంకర్ ను రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి సమాచారం పాకిస్తాన్ కు ముందుగా ఎందుకు చెప్పారని రాహుల్ వేసిన ప్రశ్నతో కేంద్రం ఇరుకునపడింది. దీంతో బీజేపీ నేతలతో పాటు విదేశాంగశాఖ కూడా ఇవాళ విడివిడిగా క్లారిటీ ఇచ్చాయి.

centre responded to Rahul Gandhi s pak informed allegations says only at early stage

ఉదయం రాహుల్ గాంధీ ఎక్స్ లో విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడిన వీడియో షేర్ చేశారు. ఇందులో విదేశాంగ మంత్రి మే 6, 7 తేదీలలో మధ్య రాత్రి నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ప్రారంభంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే దాడి చేస్తున్నామని, సైనిక స్థావరాలను కాదని పాకిస్తాన్‌కు సందేశం పంపినట్లు చెప్పారు. ఆపరేషన్ ప్రారంభంలో తాము పాకిస్తాన్‌కు ఒక సందేశాన్ని పంపామమని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై మాత్రమే దాడి చేస్తున్నామని, సైన్యంపై దాడి చేయడం లేదని, కాబట్టి సైన్యం ప్రత్యేకంగా ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా ఉండే అవకాశం ఉందని జైశంకర్ తెలిపారు. వారు ఆ మంచి సలహాను వినిపించుకోలేదన్నారు.

అయితే దీన్ని బీజేపీతో పాటు విదేశాంగశాఖ ఖండించాయి. విదేశాంగమంత్రి జైశంకర్ అలా అనలేదని, ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించినట్లు చెప్పుకొచ్చాయి.రాహుల్ ఎక్స్ పోస్టుపై బీజెపి అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి వెంటనే స్పందించారు. కేంద్రం పీఐబీ ద్వారా దీనిపై ఇచ్చిన క్లారిటీని షేర్ చేశారు. రాహుల్ గాంధీ నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
ఆపరేషన్ సిందూర్ ప్రారంభానికి ముందే భారతదేశం పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చిందని విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన ప్రకటనను సోషల్ మీడియా పోస్ట్ తప్పుగా సూచిస్తుందని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లో తెలిపింది. ఆయన ఈ ప్రకటన చేయలేదంది.

రాహుల్ వ్యాఖ్యలపై విదేశాంగశాఖ కూడా స్పందించింది. ప్రారంభంలోనే పాకిస్తాన్‌ను హెచ్చరించామని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఇది ఆపరేషన్ సిందూర్ ప్రారంభం తర్వాత స్పష్టంగా ప్రారంభ దశ అని తెలిపింది. ఇది ప్రారంభానికి ముందు జరిగినట్లు తప్పుగా చిత్రీకరించబడుతోందని చెప్పుకొచ్చింది. వాస్తవాలను ఈ విధంగా తప్పుగా చూపించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+