జోక్ అన్నప్పటికీ..: ట్రంప్‌కు బెదిరింపు, సాఫ్టువేర్ కంపెనీ సీఈవో ఉద్యోగం ఊడింది
వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తానని బెదిరించడంతో.. ఓ కంపెనీ సీఈవో తన ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఇటీవల ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
ట్రంప్ గెలవడం ఓ కంపెనీ సీఈవోకు నచ్చలేదు. అతని పేరు మాట్ హారిగన్. అతను ప్యాకెట్ స్లెడ్ అనే సాఫ్టువేర్ కంపెనీకి సీఈవో. ట్రంప్ గెలిచిన విషయం తెలియగానే ఆయన ఆగ్రహంతో.. డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తానని సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

ఆ పోస్ట్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. దీంతో కంపెనీ యాజమాన్యం భయపడింది. వెంటనే అతనిని అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌లో ఉన్నట్లు ప్రకటించింది.
తప్పు తెలుసుకున్న అతను.. సరదాగా జోక్ చేశానని, తన గురించి తెలిసినవారెవ్వరూ తాను హత్యకు ప్లాన్ చేస్తానని అనుకోరని, తప్పైతే క్షమించమని మరో పోస్ట్ పెట్టాడు. కానీ అప్పటికే అంతా జరిగిపోయింది. మాథ్యూ పోస్ట్‌ను కంపెనీ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. సీఈవో పదవికి అతడి రాజీనామాను అంగీకరించినట్లు ప్రకటించింది.












Click it and Unblock the Notifications