డెంటల్ టెక్నీషియన్‌పై లైంగిక దాడి: హీరోపై కేసు
లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ నటుడు చార్లీ షీన్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. అతను తనను కావాలని భావపరమైన ఒత్తిడికి గురి చేశాడని చార్లీ డెంటల్ టెక్నీషియన్ మార్గరిటా పాలెస్టినో ఫిర్యాదు చేశారు. అతడు తన డెంటల్ చైర్ నుంచి ఒక్కసారిగా గెంతి, నైట్రస్ ఆక్సైడ్ మాస్క్ తీసేసి, తనను గట్టిగా పట్టుకున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు.
ఆ సంఘటన సెప్టెంబర్ 25వతేదీన జరిగింది. లాస్ ఏంజెలెస్ కౌంటీ సుపీరియర్ కోర్టులో పాలెస్టినో తరఫు న్యాయవాదులు ఈ ఫిర్యాదు చేశారు. 49 ఏళ్ల చార్లీ షీన్ దంత వైద్యం చేయించుకుంటుండగా, నైట్రస్ ఆక్సైడ్ మాస్క్ వేసిన కొద్దిసేపటికే ఉన్నట్టుండి ఒక్కిసారి లేచి అసభ్యరంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు.

తన వక్షోజాలను పట్టుకుని లాగాడని, తన బ్రాను చింపేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించారు. మాస్క్ వేయడానికి ప్రయత్నించినప్పుడు చార్లీ షీన్ ఆ పనిచేశాడని ఆమె చెప్పారు. ఇటీవలి కాలంలో షీన్ బాగా ఎక్కువగా కొకైన్ వాడుతున్నట్లు ఇతర డెంటిస్టులు చెప్పారని ఆమె అన్నారు.
ఇంతకు ముందు వేరే డెంటిస్టును అతను కత్తితో బెదిరించి, డెంటల్ చైర్‌ను కత్తితో పొడిచాడని ఆమె చెప్పారు. అయితే, ఆమె ఒక సెలబ్రిటీతో తనకు దొరికిన పావు గంట సమయాన్ని వాడుకోవడానికి ఇలా అసత్య ఆరోపణలు చేస్తోదని షీన్ న్యాయవాది మార్టీ సింగర్ అన్నారు.












Click it and Unblock the Notifications