ఆడవాళ్లు నోరుమూసుకోండి: ఆయనకు ఈమె కావాలంట

లండన్: మహిళలను ఇండ్లకే పరిమితం చేస్తే నోరుమూసుకుని ఉంటారని ఇంటర్ నెట్ లలో ఇష్టం వచ్చినట్లు కామెంట్ లు పోస్టు చెయ్యరని ఒక రాజకీయ నాయకుడు నోరు పారేసుకున్నాడు. తాను చేసిన తప్పునకు దేశంలోని మహిళల మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

చెచెన్యా రిపబ్లిక్ నేత కాదీరోవ్ మహిళ నెటిజన్ల మీద నోరుపారేసుకున్నారు. కాదీరోవ్ బహుభార్యత్వంపై చెచెన్యా దేశంలోని మహిళలు మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న అరాచకంపై లక్షల మంది మహిళలు మండిపడుతూ విమర్శలు చేశారు.

Chechen President Kadyrov. 17 Years old women Forced Marriage

ఇటివల కాదీరోవ్ (47) చెచెన్యాకు చెందిన ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె వయస్సు 17 సంవత్సరాలు. ఆ అమ్మాయి ముఖంలో కనీసం ఒక్క శాతం నవ్వు కూడా లేదు. ఆయన గారు ఆ యువతిని ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే వివాహం చేసుకున్నాడు.

ఆ వివాహ కార్యక్రమ దృశ్యాలను ఒక ప్రయివేటు టీవి చానెల్ ద్వార ప్రసారం చేయించారు. దేశంలో తాను హీరో అయిపోతానని ఆయన కలలు కన్నాడు. అయితే సీన్ రివర్స్ అయ్యింది. పెళ్లి కుమార్తెకు ఇష్టం లేకుండానే పెళ్లి జరిగిందని దేశం మొత్తం తెలిసిపోయింది. పోలీసులు సైతం యువతికి వివాహం ఇష్టం లేదని అంటున్నారు.

Chechen President Kadyrov. 17 Years old women Forced Marriage

అంతే ఆదేశంలోని మహిళలు కాదీరోవ్ మీద మండిపడ్డారు. "ఇప్పటికే మీకు పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పుడు 17 సంవత్సరాల యువతి కావాలా, మీరు చేస్తున్నది మంచి పనేనా, మీరు ఎవరికి మార్గదర్శకంగా నిలవాలని అనుకుంటున్నారు" అని విమర్శలు గుప్పించారు.

అంతే కాదీరోవ్ కు అరికాలి మంట నెత్తికెక్కింది. మహిళలను ఇండ్లలో పెట్టి తాళం వేస్తే నోరుమూసుకుని, చేతులు కట్టుకుని ఉంటారని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. మళ్లీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తన మీద విమర్శలు రావడంతో ఇప్పుడు ఆయనగారు తల పట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+