Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిగురించిన స్నేహం: అత్యంత సురక్షితమైన ‘బీస్ట్’ లోపలి భాగాన్ని చూపిన ట్రంప్

సింగపూర్ సిటీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య మంగళవారం జరిగిన భేటీ వారి మధ్య మంచి స్నేహాన్ని చిగురింపజేసినట్లుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వాహనంగా పేరున్న అమెరికా అధ్యక్షుడి వాహనాన్ని కిమ్‌కు ప్రత్యేకంగాచూపించారు.

Check out my ride: Trump shows Kim Jong Un ‘The Beast’

డొనాల్డ్ ట్రంప్ ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి మరీ అత్యంత శక్తివంతమైన తన కారును కిమ్‌కు స్వయంగా చూపించడం విశేషం. భోజనాలు ముగిసిన తర్వాత తమ భద్రతా సిబ్బందితో ట్రంప్, కిమ్‌లు పోర్టు కోలో ఉన్న బీస్ట్ వద్దకు వచ్చారు. ఎప్పుడూ ట్రంప్ వెన్నంటే ఉండో ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కారు తలుపు తీసి లోపల భాగాలను కిమ్‌కు చూపించారు.

Check out my ride: Trump shows Kim Jong Un ‘The Beast’

అయితే, అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఈ ది బీస్ట్(కాడిలాక్) సమీపంలోకి కూడా ఎవరినీ రానీయరు. అలాంటిది కిమ్ జోంగ్ ఉన్‌కు ట్రంప్ వెంట తీసుకెళ్లి మరీ కారు లోపలి భాగాలను చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి సైనిక, రసాయనిక దాడినైనా ఈ బీస్ తట్టుకోగలుతుంది. ఈ కారు విలువ రూ. సుమారు రూ.10.78కోట్లు.

Check out my ride: Trump shows Kim Jong Un ‘The Beast’

కాగా, కిమ్ భద్రతకు ఉపయోగించే వాహనం కూడా ట్రంప్ బీస్ట్‌కు తక్కువేం కాదు. ఆయుధాలతో కూడిన మెర్సిడెస్ బెంజ్ ఎస్600కారు కిమ్ ఉపయోగిస్తారు. దీని విలువ 2మిలియన్ డాలర్లు కావడం గమనార్హం. అంటే ట్రంప్ బీస్ట్ కారు కంటే 0.4మిలియన్ డాలర్లు ఎక్కువగానే ఉందన్నమాట ఈ కారు ఖరీదు. కాగా, ట్రంప్, కిమ్ సమావేశాలు విజయవంతమయ్యాయని భేటీ అనంతరం ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలు ప్రపంచ శాంతి కోసం పనిచేస్తాయని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+