అమ్మా, అమ్మమ్మలపై లైంగికదాడి: హత్య

వాషింగ్టన్: సభ్య సమాజం తలదించుకునే ఘటన అమెరికాలో జరిగింది. కన్న తల్లి మీద లైంగిక దాడి చేశాడు. చివరికి అమ్మమ్మ మీద అత్యాచారం చేశాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన అమ్మమ్మను అతి దారుణంగా చంపేశాడు.

డ్రగ్స్ సేవించి గర్ల్ ఫ్రెండ్ తో ఇంటికి వచ్చిన సమయంలో అతనిని అడ్డుకున్న కుటుంబ సభ్యుల మీద ఓ యువకుడు ఈ విధంగా పగ తీర్చుకున్నాడు. పోలీసుల కథనం మేరకు అమెరికాలోని పెన్సిల్వేయాలో కెవిన్ హావ్లో (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.

ఇతను డ్రగ్స్ కు భానిసయ్యాడు. మంగళవారం గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి విపరీతంగా డ్రగ్స్ సేవించాడు. నేరుగా గర్ల్ ఫ్రెండ్ ను ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ సమయంలో కెవిన్ తల్లి అతనిని అడ్డుకుంది. ఇంటిలోకి రాకూడదని ఆమె కెవిన్ కు చెప్పింది.

Chester County man charged with killing grandmother in US

అంతే రెచ్చిపోయిన కామాంధుడు కన్నతల్లి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఆమె కష్టపడి తప్పించుకుని అక్కడి నుంచి పరారైనారు. ఇంకా ఉన్మాదిగా మారిపోయిన కెవిన్ 80 సంవత్సరాల అమ్మమ్మ మీద లైంగిక దాడి చేశాడు.

అమె మీద అత్యాచారం చేశాడు. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అయితే సమీపంలోని కత్తి తీసుకున్న కెవిన్ అమ్మమ్మ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. వేరే గదిలో నుంచి విషయం గుర్తించిన కెవిన్ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్దురాలిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని పోలీసులు చెప్పారు. కెవిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని మీద అత్యాచారం, హత్యతో పాటు క్రిమినెల్ కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

కెవిన్ అరాచకాలు చూసి పోలీసులు సైతం నివ్వెరపోయారు. కన్నతల్లితో పాటు అమ్మమ్మ మీద లైంగిక దాడికి పాల్పడటం సిగ్గుచేటు అని పోలీసులు అన్నారు. కెవిన్ సోదరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+