పాక్‌లో చోటా షకీల్ కుమార్తె పెళ్లి: దుబాయ్‌లో రిసెప్షన్!

ముంబై: పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అండర్ వరల్డ్ డాన్ బాబుమియా చోటా షకీల్ కుమార్తె జోయా వివాహం అమెరికాకు చెందిన వైద్యుడితో పాకిస్థాన్‌లో జరిగింది. ఈ వివాహం గతవారం కరాచీలోని డిఫెన్స్ ఏరియాలో ఉన్న ఓ ప్యాలెస్‌లో ఘనంగా జరిగినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టి గమనిస్తే చోటా షకీల్‌కు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తోందని అర్థమవుతోంది.

సెప్టెంబర్ 22న షకీల్ కూతురు వివాహం జరిగిందని ముంబై పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే దుబాయ్‌లో ఈ వివాహ రిసెప్షన్ జరుపనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. చోటా షకీల్ కార్యకలాపాలపై నిఘా పెట్టారు. ముంబై ఎయిర్‌పోర్టులో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.

Chhota Shakeel’s daughter got married in Pakistan this month

సెప్టెంబర్ 27న దుబాయ్‌లో షకీల్ కూతురు వివాహ రిసెప్షన్ జరుగుతుందనే సమాచారం రావడంతో పోలీసులు నిఘా విస్తృతం చేశారు. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి ముంబై నుంచి అతని శ్రేయోభిలాషులు, సెలబ్రిటీలు వెళ్లే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ముంబై నుంచి దుబాయ్ వెళ్లేవారిపై దృష్టి పెట్టినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. అయితే వారు దుబాయ్‌కి నేరుగా కాకుండా మరికొన్ని చోట్లు తిరిగి దుబాయ్ చేరుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అవసరమైతే దుబాయ్‌లోని అధికారులను సంప్రదించనున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+