దొంగా-పోలీస్ ఆట: తమ్ముడ్నికాల్చేసిన ఆరేళ్ల పిల్లాడు

చికాగో: ఆరేళ్ల బాలుడు దొంగ - పోలీస్ ఆట ఆడుతూ మూడేళ్ల తమ్ముడిని నిజమైన తుపాకీతో కాల్చాడు. ఆరేళ్ల బాలుడికి ఆడుకుంటున్న సమయంలో ఇంట్లోని రిఫ్రిజిరేటర్ పైన తూటాలతో నిండిన తుపాకీ దొరికింది. తండ్రి దానిని నిర్లక్ష్యంగా అక్కడ పెట్టడం... అతని మూడేళ్ల కొడుకును బలి తీసుకొంది.

అమెరికాలోని చికాగో సమీపంలో కుక్‌కౌంటీలో నివాసముండే మైకేల్ శాంటియాగో (25)కు ఇద్దరు కొడుకులు. ఒకరు ఆరేళ్ల బాలుడు, మరొకరు మూడేళ్ల బాలుడు. గత శనివారం చిన్నారులిద్దరు దొంగా - పోలీస్ అట ఆడుకొంటుండగా ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌పై తండ్రి దాచిన రివాల్వర్ పెద్ద కుమారుడికి దొరికింది.

Chicago boy accidentally shoots, kills brother: police

అతడు ఆ రివాల్వర్‌తో తన తమ్ముడు ఇయాన్ శాంటియాగోను కాల్చాడు. తీవ్రంగా గాయపడ్డ ఇయాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ రివాల్వర్‌ను మైకేల్ ఇటీవలే రోడ్డు పక్కన కొనుకొచ్చాడని, దానికి లైసెన్స్ లేదని విచారణలతో తేలటంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

పిల్లలను ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంచినందుకు బాలుడి తండ్రి మైకేల్ శాంటియాగో పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేశారు. కాగా, తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ప్రమాదకర వస్తువులు, తుపాకుల వంటివి ఇళ్లలో పెట్టుకోవద్దని మృతి చెందిన పిల్లాడి తాత రోదిస్తూ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+