వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐడియా అదిరింది గురూ.. : 'చికెన్ లెగ్స్ తో లెదర్ బ్యాగ్స్'

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సృష్టికి ప్రతిసృష్టి చేయగల పరిజ్ఞానం శాస్త్రవేత్తల సొంతం. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే ప్రత్యామ్నాయాలను తయారుచేయడంలో సైంటిస్టులది అందె వేసిన చేయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో బీఫ్ బ్యాన్ కొనసాగుతుండడంతో, తోలు ఆధారిత పరిశ్రమలకు లెదర్ ఉత్పత్తుల కొరత ఏర్పడుతోంది.

దీన్ని అధిగమించి మార్కెట్ లో లెదర్ ఉత్పత్తుల అవసరాలను తీర్చడానికి ప్రత్యామ్నాయాలపై ఫోకస్ చేసిన పరిశోధకులు చికెన్ లెగ్స్ అయితేనే ఇందుకు కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు. ఇంకేముంది ఆ దిశగా ఇప్పడు ప్రయత్నాలు కూడా మొదలవబోతున్నాయి. దీంతో భవిష్యత్తులో చికెన్ లెగ్స్ నుంచి తీసిన స్కిన్ తో చేసిన లెదర్ బ్యాగ్స్ మార్కెట్ లో దర్శనమివ్వడం ఖాయం.

Chicken in bag

సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ గిరిష్ సహాని వెల్లడించిన వివరాల ప్రకారం.. బీఫ్ బ్యాన్ వల్ల ఏర్పడ్డ లెదర్ కొరతకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ టెక్నాలజీ ఆధారంగా సింథటిక్ లెదర్ ను తయారుచేయాల్సిందిగా సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎల్ఆర్ఐ) పరిశోధకులను కోరినట్టుగా చెప్పారు.

దీనికి ప్రత్యామ్నాయ మార్గం కనిపెట్టిన పరిశోధకులు చికెన్ లెగ్స్ నుంచి తీసే స్కిన్ ఫ్యాబ్రిక్ లెదర్ కి సరిపోయే విధంగా ఉంటుందన్న విషయం కనుగొన్నారు. ఇదే విషయాన్ని సంస్థ డైరెక్టర్ బి. చంద్రశేఖరన్ ప్రకటించారు. సీఎల్ఆర్ఐ డైరెక్టర్ పరిశోధకుల ఈ కొత్త ప్రయోగం త్వరలోనే పట్టాలెక్కనున్నట్టు సమాచారం. కాబట్టి త్వరలోనే ఇక చికెన్ లెగ్స్ స్కిన్ తో తయారు చేసిన లెదర్ వస్తువులు మార్కెట్ లోకి వచ్చేవడం ఖాయం.

English summary
Faced with a possibility of reduced leather production in the wake of the beef ban in some states, scientists have come up with a novel method of manufacturing a fabric with chicken legs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X