పాక్‌లో హై టెన్షన్: నేషనల్ అసెంబ్లీ వాయిదాల పర్వం, సుప్రీంకోర్టు సీరియస్, అర్ధరాత్రి తీయాలంటూ..

పాకిస్థాన్‌ రాజకీయాల్లో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ దృష్ట్యా హైటెన్షన్ నెలకొంది. తీర్మానంపై ఓటింగ్ ఎప్పుడో జరగాల్సి ఉండగా.. స్పీకర్ నిర్ణయం, ఇమ్రాన్ వ్యుహాలతో ఆగింది. అయితే కోర్టు జోక్యంతో నిర్వహించక తప్పడం లేదు. ఇవాళ ఉదయం నుంచి కూడా పరిణామాలు చక చకా మారిపోతున్నాయి. మరోవైపు జాతీయ అసెంబ్లీ సెక్రటేరియట్ అధికారులు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్‌ను కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు జియో న్యూస్ రిపోర్ట్ చేసింది.

అంతకుముందు ఉన్నతాధికారులను స్పీకర్ తన చాంబర్ వద్దకు పిలిచారు. పాక్‌లో జరుగుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం కాస్త సీరియస్‌గా ఉంది. ఈ మేరకు సంబంధిత అధికారులు.. సుప్రీంకోర్టు తలుపులు రాత్రి 12 గంటలకు తెరవాలని కోరినట్టు సమాచారం. మరోవైపు పాకిస్థాన్ ప్రతిపక్ష నేత మరియం.. జరుగుతున్న ఇన్సిడెంట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను అరెస్ట్ చేయాలని కోరారు. అన్నీ వ్యవస్థలపై ప్రధాని ప్రభావం చూపుతున్నారని కామెంట్ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ఆదేశాలను బ్యూరోక్రాట్లు పాటించాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతకుముందు స్పీకర్ అసద్ ఖైసర్ మాట్లాడారు. తాము సుప్రీంకోర్టు నిర్ణయాన్ని చదివామని.. తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. అంతకుముందు సభ వాయిదా పడుకుంటూ వచ్చింది.

Chief Justice asks officials to open Supreme Court at midnight: Pak media

పాకిస్థాన్ దిగువ స‌భ్య‌లో 342 మంది స‌భ్యులు ఉన్నారు. ప్ర‌తిప‌క్షాలు అవిశ్వాసంలో నెగ్గాలంటే వారికి 172 స‌భ్యుల ఓట్లు అవ‌స‌రం. ప్ర‌స్తుతం ఇమ్రాన్ కూట‌మిలో 178 మంది, ప్ర‌తిప‌క్షాల కూట‌మిలో 163 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పీటీఐకి చెందిన 24 మంది సభ్యులు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బహిరంగంగా ప్రకటించారు.

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాలంటే 68 మంది ఎంపీల సంతకాలు అవసరం. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 100 మంది సభ్యులు ఇప్పటికే సంతకం చేశారు. ఇమ్రాన్ పార్టీ ఎంపీలు రెబల్స్‌గా మారడంతో ఇప్పుడు ఆయన పదవీకి గండం ఏర్పడింది. గ‌తంలో రెండు సార్లు పాకిస్థాన్ ప్ర‌ధానుల‌పై అవిశ్వాస తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అవి వీగిపోయాయి. తొలుత 1989లో బెన‌ర్జీ భుట్టోపై అవిశ్వాస తీర్మానం పెట్ట‌గా ఆమె 12 ఓట్ల తేడాతో నెగ్గారు. 2006లో ప్ర‌ధాని షౌకాత్‌ అజీజ్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఓడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+