పెషావర్: ఎదిరించిన మహిళా టీచర్‌ను పిల్లల ముందే కాల్చేశారు
పెషావర్: పాకిస్తాన్‌లో తాలిబన్లు 132 మంది చిన్నారులు, పాఠశాల సిబ్బందిని తగులబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయురాలు కిరాతకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆమెను పిల్లల ముందే వారు తగులబెట్టారు. నరమేధం సాగిస్తున్న పాక్ తాలిబన్ల దారికి అడ్డంగా నిలిచి, వారిని ఎదిరించి, ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయిని అఫ్షా అహ్మద్ (24).
ఉగ్రవాదులను ఆమె ఎలా ఎదిరించిందీ, వారు ఆమెను ఎలా సజీవదహనం చేసిందీ ఓ విద్యార్థి చెప్పాడు. అతడి పేరు ఇర్ఫానుల్లా(15). ఉగ్రవాదులు లోపలికి రాగానే ఆమె మాకూ వారికీ మధ్యలో నిలిచి ధైర్యంగా వారిని అడ్డగించారని, మమ్మల్ని చంపాలంటే వారు ముందు తనను చంపాలని చెప్పారని తెలిపాడు.
నా విద్యార్థులు రక్తపుమడుగులో పడి ఉండటాన్ని తాను చూడలేన్న ఆమె ఆఖరి మాటలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయని చెప్పాడు. దీంతో వారు ఆమెపై పెట్రోలు పోసి సజీవంగా తగలబెట్టేశారన్నాడు. పిల్లలు చూస్తుండగా చంపేశారని చెప్పాడు. ప్రస్తుతం అతడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మెయిన్‌హాల్‌లో మాకు ప్రథమ చికిత్స పాఠం బోధిస్తుండగా ఇంతలో కాల్పుల మోత వినిపించిందని, టీచర్లు, ఇన్‌స్ట్రక్టర్లు మమ్మల్ని కాసేపు నిశ్శబ్దంగా ఉండమన్నారని, క్రమేపీ మోత దగ్గరయిందని, మరో నిమిషానికి తమ గది తలుపులు, కిటికీల అద్దాలపైకి తూటాలు వచ్చాయని, కొందరు హాల్ తలుపులను గట్టిగా తన్నడం మొదలు పెట్టారని ఇలాహీ అనే పదమూడేళ్ల విద్యార్థి చెబుతున్నాడు.
లోపల మేం 100 మంది దాకా ఉన్నామని, ఎవరికి వాళ్లమే సురక్షితంగా దాక్కునే చోటుకోసం ప్రయత్నించామని, కొందరు ఏడుస్తున్నారని, తాను ఒక బల్ల వెనక్కి దూకి దాక్కున్నానని, నేలమీద పడుకుండిపోయానని, ఇంతలో తలుపులు విరిగి, తూటాలు వచ్చాయని చెప్పాడు. మాకు శిక్షణ ఇస్తున్న ఇన్‌స్ట్రక్టర్లు నేలకొరిగారని ఆవేదనగా చెప్పాడు. తన స్నేహితుల తలల్లోకి, ఛాతీల్లోకి, కాళ్లూచేతుల్లోకి తూటాలు దిగడం తన కళ్లారా చూశానన్నాడు.
ఏడుస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని మరోసారి మారణహోమాన్ని కొనవసాగించారని తెలిపాడు. అప్పుడు తన కుడిచేతిలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయని, ఏడవాలనిపించినా.. చంపుతారని ఏడవలేదన్నాడు. తమలో ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలాలని వారు భావించలేదన్నాడు. అందుకే మరో నాలుగు నిమిషాలపాటు కాల్పులు జరిపారన్నాడు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications