షాక్: సింహాల బోనులో నగ్నంగా దూకాడు(వీడియో)
శాన్టియాగో: చిలీ రాజధానిలోని ఓ జూలో అధికారులు విధి లేని పరిస్థతుల్లో రెండు సింహాలను చంపేశారు. నగ్నంగా సింహాల బోనులోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆఫ్రికా సింహాలను ఉంచిన ఎన్‌క్లోజర్ తాడును పట్టుకొని ఓ వ్యక్తి(30) ఎక్కుతుండటాన్ని జూ అధికారులు పసిగట్టి వెంటనే భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసినట్లు జూ ప్రధాన అధికారి అల్‌జండ్ర మోంటల్వ తెలిపారు.

నగ్నంగా ఉన్న అతను బోనులో పడగానే ఓ ఆడ సింహం, మగ సింహం అతనిపై దాడి చేసి పడేశాయి. వాటిని అడ్డుకునేందుకు జూ అధికారులు మత్తు బాణాలతో ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో వారు వాటిని చంపి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు.
🔴 URGENTE #CHILE | El hombre que entró a la jaula de los leones en Zoo de Santiago resultó ileso.
— NoticiasChelmevision (@NOTICIAS_chelme) 21 May 2016
Mataron a 2 leones pic.twitter.com/6dCx04UbAw
'ఇక్కడి జంతువులు కూడా మా కుటుంబ సభ్యుల వంటివి. ఈ ఘటన మమ్మల్ని కదిలించేసింది' అని జూ ప్రధాన అధికారి మోంటల్వ తెలిపారు. మృతిచెందిన సింహాలు దాదాపు 20ఏళ్ల నుంచి తమతో ఉంటున్నాయని చెప్పారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సింహాల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications