సెక్స్ ఇండస్ట్రీ.. రూట్ మార్చిన వేశ్యలు.. లాక్ డౌన్‌తో పెను మార్పులు..

లాక్ డౌన్ పీరియడ్‌లో అన్ని రంగాల లాగే సెక్స్ ఇండస్ట్రీపై కూడా దాని ప్రభావం పడింది. వేశ్యలపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపించగా.. ఆన్‌లైన్ సెక్స్ ఇండస్ట్రీకి మాత్రం కలిసొచ్చింది. వ్యభిచారం పైనే ఆధారపడి జీవించే వేశ్యలకు పని లేకుండా పోయింది. అదే సమయంలో ఆన్‌లైన్‌లో పోర్న్ కంటెంట్‌‌కి ట్రాఫిక్ పెరిగింది. ఈ నేపథ్యంలో చాలామంది వేశ్యలు లాక్ డౌన్ పీరియడ్‌లో టెక్నాలజీని వాడుకుని డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. చీలీ లాంటి దేశాల్లో నిన్న మొన్నటిదాకా వీధుల్లో విటులను ఆకర్షించిన వేశ్యలు.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కస్టమర్స్‌ను కవ్విస్తున్నారు.

చీలీకి చెందిన కెమిలా అనే వేశ్య..

చీలీకి చెందిన కెమిలా అనే వేశ్య..

చీలీకి చెందిన కెమిలా(24) చాలా కాలంగా వేశ్యగా పనిచేస్తోంది. సాధారణ రోజుల్లో ఎంత లేదన్నా 715 డాలర్ల వరకు సంపాదించేది. కానీ లాక్ డౌన్ కారణంగా పని లేకుండా పోవడంతో జీవితాన్ని నెట్టుకురావడం కష్టంగా మారింది. నెలవారీ బిల్లులు,అద్దె,ఇతరత్రా ఖర్చులు భారంగా మారిపోయాయి. దీంతో కెమిలా డబ్బు సంపాదనకు ఆన్‌లైన్ మార్గాన్ని ఎంచుకుంది. తన రెగ్యులర్ కస్టమర్స్ ఆన్‌లైన్‌ ద్వారా టచ్‌లో ఉండాలని కోరింది. అప్పటినుంచి ఆన్‌లైన్‌లోనే వారిని ఎంటర్టైన్ చేస్తూ డబ్బు సంపాదిస్తోంది. మునుపటిలా కాకపోయినా ఎంతో కొంత సంపాదిస్తోంది.

లాక్ డౌన్ కారణంగా పని కోల్పోయిన సెక్స్ వర్కర్స్..

లాక్ డౌన్ కారణంగా పని కోల్పోయిన సెక్స్ వర్కర్స్..

లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది సెక్స్ వర్కర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సింగపూర్,జర్మనీ,మెక్సికో,న్యూజిలాండ్,ఇండియా,అమెరికా ఇలా తదితర దేశాల్లో సెక్స్ వర్కర్స్‌ ఆదాయం లేక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక్క చీలీ దేశంలోనే దాదాపు 60వేల మంది సెక్స్ వర్కర్స్‌కు లాక్ డౌన్ కారణంగా పని లేకుండా పోయింది. వీరందరికీ ఇదే ప్రధాన ఆదాయ మార్గమని మార్జిన్ ఫౌండేషన్ వెల్లడించింది. తమ సంస్థ వారికి సామాజిక,నైతిక మద్దతును అందిస్తోందని తెలిపింది.

'వర్చువల్'.. ఆదాయ మార్గం..

'వర్చువల్'.. ఆదాయ మార్గం..

కోల్పోయిన తమ ఆదాయాన్ని తిరిగి పొందడానికి చాలామంది వేశ్యలు ఆన్‌లైన్ లైవ్ వీడియో స్ట్రీమింగ్,ఎరోటిక్ ఫోటోగ్రాఫ్స్,వీడియో కాల్స్ వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. టెక్నాలజీతో అంతగా పరిచయం లేని వృద్ద వేశ్యలకు మధ్య తరగతి యువతులు,మహిళలు ఆ విషయంలో సాయం చేస్తున్నారు. వాట్సాప్ వీడియో కాల్స్,ఆన్‌లైన్‌లో క్లైంట్స్‌ సెర్చ్,వెబ్ క్యామ్ తదితర అంశాలపై వారు అవగాహన కల్పిస్తున్నారు.ఇలా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు సంపాదించడాన్ని తాము 'వర్చువల్స్' అని పిలుస్తామని హెర్మిండా గొంజలేజ్(59) అనే మాజీ నైట్ క్లబ్ డ్యాన్సర్,మార్జిన్ ఫౌండేషన్ ప్రతినిధి తెలిపారు.

ఆదుకుంటామన్న చీలీ ప్రభుత్వం..

ఆదుకుంటామన్న చీలీ ప్రభుత్వం..

అయితే ఇప్పటికీ కస్టమర్స్ వద్దకు వెళ్తూ డబ్బులు సంపాదిస్తున్న వేశ్యలు కూడా చీలీలో లేకపోలేదు. ఇనోస్త్రోజా అనే సెక్స్ వర్కర్ ఇప్పటికీ తన కస్టమర్స్ వద్దకు వెళ్తోంది. అయితే కస్టమర్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. మాస్కులు,గ్లవ్స్ ధరిస్తున్నారని తెలిపింది. కేవలం 10,15 నిమిషాల కంటే ఎక్కువ సమయం వారితో గడపట్లేదని పేర్కొంది. ఇక వర్చువల్ సెక్స్ ద్వారా సంపాదిస్తున్న కెమిలా.. తాను క్లైంట్స్‌తో వీడియో కాల్స్‌లో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా పింక్ మాస్క్ ధరిస్తున్నట్టు తెలిపింది. చాలామంది కస్టమర్స్ తనకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పింది. చీలీలోని సెక్స్ వర్కర్లను ఆదుకుంటామని అటు మహిళా మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. సాధారణ ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను వారికి కూడా అందిస్తామని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+