ఛిల్లింగ్ వీడియో: బంగీ జంప్ చేస్తున్నప్పుడు బెల్ట్ తెగితే ఏమౌతుందో తెలుసా?
వార్సా: బంగీ జంప్. కాలికి బెల్ట్ కట్టుకుని కనీసం 200 మీటర్ల ఎత్తు నుంచి కిందికి దూకే సాహస క్రీడ. అప్పుడేప్పుడో 20 ఏళ్ల కిందట మెగాస్టార్ చిరంజీవి ఈ సాహసం చేశారు. మొన్నటికి మొన్న- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బంగీ జంప్ చేశారు. ఊపిరిని స్తంభింపజేసే ఈ సాహసానికి పూనుకున్నప్పుడు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అంతే సంగతులు! బంగీ జంప్ చేసేటప్పుడు బెల్ట్ తెగితే ఏమౌతుందనేది ఊహించలేం. అలాంటి ఘటనే పోలెండ్‌లో చోటు చేసుకుంది.
పోలెండ్ గ్డినియాలోని ర్యాడీ యూరోఫియా థీమ్ పార్క్‌లో ఓ యువకుడు చేసిన బంగీ జంప్ బెడిసి కొట్టింది. గాల్లో ఉండగానే అతని కాలికి కట్టిన బెల్ట్ ఊడిపోయింది. అంతే- 100 మీటర్ల ఎత్త నుంచి ధబేల్ మంటూ కింద పడ్డాడు. ముందు జాగ్రత్తచర్యగా కింద అమర్చిన ఎయిర్ బెలూన్ల మీద పడటం వల్ల ప్రాణాలు నిలిచినప్పటికీ.. తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరంలో పలు ఎముకలు విరిగినట్లు డాక్టర్లు తెలిపారు.

ర్యాడి యూరోఫియా థీమ్ పార్క్‌లో క్రేన్ ఆధారంగా- సుమారు 150 నుంచి 200 అడుగుల ఎత్త వరకు వెళ్లాడా యువకుడు. అక్కడి నుంచి బంగీ జంప్ చేశాడు. వంద మీటర్ల వరకు వచ్చేంత వరకూ ఇబ్బంది పడలేదు. బెల్ట్ చివరికి అంచుకు వచ్చిన తరువాత ఉన్నట్టుండి దాని బకిల్ ఊడిపోయింది. అంతే! అంతెత్తు నుంచి తలకిందులుగా దబ్బుమంటూ ఎయిర్ బెలూన్‌పై పడ్డాడు.
అక్కడితో ఆగలేదు. ఎయిర్ బెలూన్ కదా! పడ్డ వెంటనే మరోసారి గాల్లోకి ఎగిరి నేల మీద పడ్డాడు. తలకిందులుగా పడటంతో అతని మెడ ఎముక విరిగింది. అంతేకాదు- శరీరంలో పలుచోట్ల ఎముకలు విరిగినట్లు తేలింది. బంగీ జంపింగ్ క్లబ్ నిర్వాహకులు వెంటనే అంబులెన్స్‌ను పిలిపించారు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడట. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications