ఇక అక్కడ మగవారిపై అత్యాచారాలూ నేరమే

బీజింగ్‌: చైనాలో ఇకపై మగవారిపై జరిగే అత్యాచారాలు నేరంగానే పరిగణించబడతాయి. మగవారిపై జరుగుతున్న అత్యాచారాలపై విచారించిన అక్కడి న్యాయస్థానాలు, ఇకపై వారిపై జరిగే అఘాయిత్యాలపై నేరాలు పరిగణించి కఠిన శిక్షలు అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి.

ఈ మేరకు అక్కడి క్రిమినల్‌ లాలో కూడా సవరణ జరిగింది. ఇకపై ఆడ, మగ.. ఎవరిపై అత్యాచారం చేసినవారికైనా ఐదేళ్లు కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

2010లో ఓ కంపెనీలో పనిచేసే సెక్యూరిటీ గార్డు మరో మగ ఉద్యోగి చేతిలో అత్యాచారానికి గురయ్యాడు. ఆ కేసు కోర్టుకి వెళ్లింది. అయితే అప్పటికి ఆడవాళ్లపై అత్యాచారన్నే క్రిమినల్‌ కేసుగా పరిగణించేవారు.

China amends law to make male rape a crime

ఇలాంటి కేసు కొత్త కావడంతో న్యాయమూర్తులకు ఏమి చేయాలో తెలియలేదు. ఆ నిందుతుడు అత్యాచారం కేసులో కాకుండా సెక్యూరిటీ గార్డును గాయపరిచిన కేసులోనే స్వల్ప శిక్షకు గురయ్యాడు.

అయితే ఆ తీర్పుపై విమర్శలు తలెత్తడంతో క్రిమినల్‌ లాలో సవరణ చేయాలని అక్కడి నిపుణులు భావించారు. అంతేకాకుండా 14 సంవత్సరాలు దాటని వ్యభిచారిణులతో కలిసినా దానిని అత్యాచారంగానే భావించాలని సవరణ జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+