పాకిస్థాన్ కు చైనా 3.4 బిలియన్ డాలర్ల భారీ సాయం.. భారత్ పై బిగ్ స్కెచ్..!
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ చైనా మరోసారి పాకిస్థాన్ కు భారీగా సాయం చేసింది. పాకిస్థాన్ కు 3.4 బిలియన్ డాలర్లు ఆర్థిక సాయం చేయాలని చైనా తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్థాన్ విదేశీ మారకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. చైనా ఇవ్వనున్న 3.4 బిలియన్ డాలర్లను కలిపితే పాకిస్థాన్ విదేశీ మారకాల నిల్వ 14 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) లక్ష్యాలను చేరుకోవాలంటే పాకిస్థాన్ ఇలా అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ పై భారత్ కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో వివిధ దేశాలు, ప్రపంచ సంస్థల నుంచి భారీగా రుణాన్ని సమీకరిస్తోంది పాకిస్థాన్. ఈ క్రమంలో పాకిస్థాన్ కు చైనా భారీ సాయం చేసింది. పాక్ కు చైనా 3.4 బిలియన్ డాలర్లు రుణం అందించింది.

చైనా చేసిన రుణ సాయంతో పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు 14 బిలియన్ డాలర్లకు చేరింది. చైనా ఈ మొత్తం డబ్బును 2.1 బిలియన్ డాలర్లు ఓ సారి.. 1.3 బిలియన్ డాలర్లు మరోసారి అందించనుంది. అంతేకాక పాకిస్థాన్ కు మిడిల్ ఈస్ట్ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి 1 బిలియన్ డాలర్లు వచ్చింది. మరో 500 మిలియన్ డాలర్లు మల్టీలేటరల్ ఫైనాన్సింగ్ ద్వారా చేకూరింది. దీంతో పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు 14 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో IMF నిర్దేశించిన లక్ష్యాన్ని ముందుగానే చేరుకుంది పాకిస్థాన్. ఈ ఏడాది జూన్ 30 నాటికి 14 బిలియన్ డాలర్ల దాటాలని IMF పేర్కొంది.
China rolls over .4 billion in commercial loans to Pakistan, easing pressure on reserves ahead of IMF deadline and underscoring deepening strategic trust. pic.twitter.com/KtIFkjzVcR
— Mansoor Ahmed Qureshi (@MansurQr) June 29, 2025
అంతకుముందు ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడానికి పాకిస్తాన్ ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB)తో 350 మిలియన్ డాలర్లు రుణ ఒప్పందంపై సంతకం చేసింది. ఉమెన్స్ ఇన్‌క్లూజివ్ ఫైనాన్స్ (WIF) సెక్టార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ రుణ సాయం చేసింది ఆసియా అభివృద్ధి బ్యాంకు. ఇక జూన్ 9న విడుదలైన ఎకనామిక్ రివ్యూ 2024-25 ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్ అప్పు 76,000 బిలియన్ డాలర్లకు పెరిగింది. నగదు కొరత ఉన్నా దేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 2.7 శాతం రేటుతో వృద్ధి రేటు సాధించగలదని సూచీ పేర్కొంది.












Click it and Unblock the Notifications