బరితెగించిన చైనా: యుద్ధానికి ఒక్క అడుగు దూరంలో
తైపే: డ్రాగన్ కంట్రీ చైనా బరితెగించింది. తైవాన్‌పై యుద్ధానికి సన్నద్ధమైంది. ఈ ద్వీపదేశం చుట్టూ పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను మోహరింపజేసింది. యుద్ధ సన్నాహకాలను పూర్తి చేసింది. ఏ క్షణమైనా తైవాన్‌పై యుద్ధం ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. దీనిపై కీలక ప్రకటన కూడా విడుదల చేశారు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు.
తైవాన్ సమీపంలో నిర్దేశిత లక్ష్యాలపై నమూనా దాడుల (Simulated Strikes)ను కొనసాగించినట్లు ప్రకటించింది. ఈ దాడులు విజయవంతమైనట్లు తెలిపింది. సిములేటెడ్ దాడులను విజయవంతంగా ముగించడం అంటే పూర్తిస్థాయి యుద్ధానికి ఒక్క అడుగు దూరంలో నిలిచినట్టే. చైనా వీటిని పూర్తిస్థాయి యుద్ధంగా మలుచుతుందా? లేదా? అనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఆందోళనకు గురి చేస్తోంది.
ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతోంది. 14 నెలలుగా ఈ రెండు దేశాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు వ్యూహాత్మక నగరాలు, ప్రాంతాలను రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. రాజధాని కీవ్‌ను సొంతం చేసుకునే దిశగా సాగుతున్నారు. ఈ క్రమంలో కీవ్‌లోని కొన్ని కీలక ప్రాంతాలపైనా దాడులు చేశారు గానీ అవి పెద్దగా ఫలించట్లేదు.

అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాలు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ సభ్య దేశాలు అందించే ఆయుధ సామాగ్రితో ఉక్రెయిన్ సైన్యం రష్యాను నిలువరిస్తోంది. ఈ పరిణామాల మధ్య ఇప్పుడు తాజాగా తైవాన్‌పై చైనా యుద్ధ సన్నాహకాలను చేపట్టడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. చైనా గనక యుద్ధానికి దిగితే- తైవాన్‌కు అండగా అమెరికా రంగంలోకి దిగడం ఖాయం.
అంతర్యుద్ధం ముగిసిన తరువాత 1949లో చైనా నుంచి తైవాన్ విడిపోయింది. బలవంతంగానైనా తమ దేశంలో తైవాన్ అంతర్భాగం కాక తప్పదని చెబుతూ వస్తోంది డ్రాగన్ కంట్రీ. తైవాన్‌లో అమెరికా జోక్యం పెరగడాన్ని తప్పుపడుతోంది. ఇదివరకు అమెరికా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ స్పీకర్ న్యాన్సీ పెలోసీ చేపట్టిన తైవాన్ పర్యటనను కూడా తప్పు పట్టింది చైనా. అప్పటి నుంచే చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
ఇటీవలే తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ అమెరికా పర్యటనకు వెళ్లొచ్చారు. ఆమె స్వదేశానికి చేరుకున్న కొన్ని గంటల్లోనే చైనా తన సైనిక విన్యాసాలను ప్రారంభించింది. 71 సైనిక విమానాలు, తొమ్మిది నౌకలు తైవాన్ జలసంధిలో మోహరించాయి. తైవాన్ సరిహద్దులను కూడా దాటాయి. తైవాన్‌పై యుద్ధ సన్నాహకాల్లో భాగంగా చైనా రెండు రోజులుగా ఆ దేశం చుట్టూ వార్ డ్రిల్స్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications