ఆ కంపెనీలో అనుమతిలేని ప్రెగ్నెన్సీకి శిక్షే!

బీజింగ్: చైనాలో ఓ కంపెనీ తమ ఉద్యోగులను వినూత్న రీతిలో ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమైంది. ప్లానింగ్ లేకుండా గర్భం దాలిస్తే ఊరుకునేది లేదని, ప్రెగ్నెన్సీ గురించిన ప్రణాళికలు ముందుగానే కంపెనీకి తెలియజేయాలని నిబంధనలు పెట్టింది.

ఒకవేళ ఆ నిబంధనల్ని అతిక్రమిస్తే వంద యువన్ల (రూ. 11,239) జరిమానా కూడా చెల్లించాలని షరతు పెట్టింది. చైనాలోని హెనాన్ ప్రావిన్స్ పరిధిలో గల ఈ కంపెనీ ఎక్కువగా మహిళలకే అవకాశాలిస్తుంది. అందులో చేరే సమయంలో ఇచ్చే అప్లికేషన్‌లో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి ముందుగానే రాయాలి.

China firm 'plans to punish unapproved staff pregnancies'

ఒకవేళ ఆ అప్లికేషన్‌లో రాసిన దాన్ని పాటించకపోతే వారికి జరిమానా తప్పదు. అంతేకాదు మాట తప్పిన వారికి పదోన్నతులు, ప్రోత్సహకాల్లో కూడా కోతలు తప్పవు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా లీకవడంతో ఆ కంపెనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మనుషుల్ని.. మనుషుల్లా కాకుండా యంత్రాల్లా చూడటం మాననంత వరకూ ఇలాంటి కొత్త నిబంధనలు మరిన్ని వచ్చే అవకాశముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమర్శల నేపథ్యంలో ఆ కంపెనీ నిబంధనలు సడలిస్తుందో.. లేదో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+