ట్రంప్‌ను ఠారెత్తించిన చైనా: ఎక్కడ కొట్టాలో అక్కడే..

Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లకు అడ్డు అదుపు ఉండట్లేదు. ఈ విషయంలో రోజుకో కొత్త ప్రకటన జారీ చేస్తోన్నారు. టారిఫ్‌ల యుద్ధానికి తెర తీశారు. వందకు పైగా దేశాలు అమెరికా టారిఫ్‌ల రాడార్‌లోకి వెళ్లిపోయాయి. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు.

ఇప్పుడు తాజాగా చైనాపై మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో టారిఫ్ విధించారు. డ్రాగన్ కంట్రీ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 245 శాతం మేర టారిఫ్‌ను ప్రకటించారు. ఇది- ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ట్రేడ్ వార్‌‌‌‌కు మరింత ఆజ్యాన్ని పోసినట్టయింది. పతాక స్థాయికి తీసుకెళ్లినట్టయింది.

China has completely stopped buying LNG from the US

ఇదివరకు అమెరికా ప్రకటించిన టారిఫ్‌కు అనుగుణంగా మొదట్లో స్పందించింది చైనా. అమెరికా దిగుమతులపై 126 శాతం వరకు టారిఫ్‌ను ప్రకటించింది రెండుదశల్లో. తొలి దశలో 35, ఆ తరువాత 86 శాతం వరకు టారిఫ్‌‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి ప్రతీకారానికి దిగింది అమెరికా. ఏకంగా 245 శాతం మే టారిఫ్‌ను విధించినట్లు తెలిపింది.

ఈ మేరకు వైట్ హౌస్‌లో ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించింది. ఈ కొత్త టారిఫ్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది స్పష్టంగా పేర్కొనలేదు ఇందులో.

రక్షణ అవసరాలు, అంతరిక్షం, సెమీకండక్టర్ పరిశ్రమల్లో వినియోగించే కీలకమైన గ్యాలియం, జెర్మేనియం, యాంటిమొనీ వంటి వస్తువులు, పదార్థాలను చైనా ఉద్దేశపూరకంగా పరిమితం చేస్తోందని అమెరికా ఆరోపించింది. చైనా ఇటీవలే ఎర్త్ మెటల్స్‌ను ఎగుమతి చేయడాన్ని నిలిపివేసిన విషయాన్ని ఇందులో ప్రస్తావించింది.

ఈ పరిణామాల మధ్య చైనా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అమెరికా నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) దిగుమతులను పూర్తిగా నిలిపివేసింది. ఎల్‌ఎన్‌జీకి సంబంధించిన ఎలాంటి షిప్‌మెంట్ కూడా గత కొన్ని రోజులుగా నమోదు కావట్లేదని షిప్ డేటా ట్రాకింగ్ కంపెనీ కెప్లెర్ వెల్లడించింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది.

చైనా దిగుమతి చేసుకుంటోన్న ఎల్‌ఎన్‌జీపై గతంలో 19 శాతం మేరకు టారిఫ్ ఉండేది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మొత్తాన్ని సవరించారు. 30 శాతం అదనపు టారిఫ్ విధించారు. ఫలితంగా టారిఫ్ 49 శాతానికి ఎగబాకింది. ట్రంప్ విధించిన టారిఫ్‌ను దృష్టిలో ఉంచుకుని చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ గ్యాస్ రీసెర్చ్ కంపెనీ రైస్టర్డ్ ఎనర్జీ హెడ్ వీయ్ గ్ఝియాంగ్ తెలిపారు.

60 రోజులుగా చైనాకు సంబంధించి ఎల్ఎన్‌జీ షిప్ కన్‌సైన్మెంట్ కూడా రిజిస్టర్ కాలేదని అన్నారు. దీని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతుందని అంచనా వేశారు. ఎల్ఎన్‌జీకి ప్రత్యామ్నాయ వనరులను చైనా వెదుక్కోవచ్చని గ్ఝియాంగ్ చెప్పారు. సహజవాయు రంగాన్ని బలోపేతం చేసుకోవడానికి మంచి అవకాశం లభించినట్టయిందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+