China: తైవాన్ సరిహద్దులో దూకుడు పెంచిన చైనా.. యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్ల మోహరింపు..

చైనా, తైవాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. తైవాన్ ను భయపెట్టేందుకు చైనా శథావిధాల ప్రయత్నం చేస్తోంది. తాజాగా చైనా నేవీ షిప్‌లను, ఫైటర్ జెట్‌లు, బాంబర్‌లతో సహా పెద్ద సమూహ యుద్ధ విమానాలను తైవాన్‌కు రెండు రోజుల పాటు పంపింది. తమ దేశం వైపు చైనా ఫైటర్ జట్, యుద్ధ నౌకలు పంపినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తైవాన్ వైపు 38 విమానాలు, 9 నౌకలు తైవాన్‌ వచ్చినట్లు పేర్కొంది. ఇక బుధవారం ఉదయం నుంచి దాదాపు 30 యుద్ధ విమానాలు వచ్చినట్లు ప్రకటించింది. విమానాల్లో జే-10, జే-16 రకం ఫైటర్లు ఉన్నాయని వివరించింది.

ఈ 32 విమానాలు తైవాన్ ద్వీపం, ప్రధాన భూభాగం మధ్య బఫర్‌గా పరిగణించబడే అనధికారిక సరిహద్దు అయిన తైవాన్ జలసంధి మధ్యరేఖను దాటాయి. ఆ తర్వాత బుధవారం మరో 23 విమానాలు మిడ్ లైన్ దాటాయి. మరోవైపు తైవాన్ ఈ నెలాఖరులో వార్షిక హాన్ గువాంగ్ విన్యాసాలను నిర్వహించనుంది. దీనిలో భాగంగా సైన్యం దాడిని ఎలా అడ్డుకోవాలో వివరించనున్నారు. ఇది ప్రకృతి వైపరీత్యాల కోసం పౌరులను సిద్ధం చేయడం, వైమానిక దాడి జరిగినప్పడు ప్రజలను ఎలా తరలించాలే నేర్పించేందుకు వార్షిక వాన్'విన్యాసాలు కూడా నిర్వహిస్తున్నట్లు తైవాన్ పేర్కొంది.

China

చైనా.. తైవాన్‌ను తన స్వంత భూభాగంగా పేర్కొంటూ వస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో తైవాన్‌ సైనిక విమానాల సంఖ్యను పెంచడంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ఏప్రిలో చైనా తైవాన్ సరహద్దు ప్రాంతాల్లో ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలను మోహరించిన విషయం తెలిసిందే. దీంతో తైవాన్ జలసంధిలో వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగింది. విమానాలను దారి మళ్లించవలసి వచ్చింది. గత ఆగస్టులో U.S. హౌస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటనకు ప్రతిస్పందనగా చైనా ఇలా చేసినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+