అరుణాచల్‌ ప్రదేశ్ మొత్తాన్నీ కలిపేసుకున్న చైనా..!!

బీజింగ్: చైనా.. మరోసారి భారత్‌పై విషాన్ని కక్కింది. వాస్తవాధీన రేఖ, సరిహద్దు పొడవునా తరచూ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి కారణమౌతూ వస్తోన్న ఈ డ్రాగన్ కంట్రీ అలాంటి తెంపరితనాన్నే ప్రదర్శించింది. సరికొత్త వివాదానికి బీజం వేసింది. భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యవహరించింది.

చైనా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మ్యాప్- ఇప్పుడు కలకలం రేపుతోంది. ఖనిజ, సహజ వనరుల అభిృవద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2023 స్టాండర్డ్ మ్యాప్ ఇది. ఇందులో అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్నీ తనలో కలిపేసుకున్నట్లు చూపించింది. అరుణాచల్ ప్రదేశ్ భూభాగం మొత్తం తమ దేశంలో ఉన్నట్లు ఈ మ్యాప్‌ను విడుదల చేసింది.

China map claims whole Arunachal Pradesh and Aksai Chin in its territory

తమ దేశ భూభాగం అస్సాం సరిహద్దుల వరకూ విస్తరించినట్టు చూపించింది ఆ మ్యాప్. అక్కడితో ఆగలేదు. కేంద్ర పాలిత పాంతం లఢక్ సమీపంలో భారత్- చైనా వాస్తవాధీన రేఖ వద్ద గల వివాదాస్పద ప్రాంతం అక్సాయ్ చిన్‌ రీజియన్‌ను కూడా తమ దేశ భూభాగంగా చూపించింది. తైవాన్, దక్షిణ సముద్ర తీరం కూడా తమదేనని తేల్చి చెప్పింది చైనా ఈ కొత్త మ్యాప్ ద్వారా.

గతంలో- ఇలాంటి సందర్భాలు చాలావరకు ఉన్నప్పటికీ.. ఈ సారి మాత్ర దాని తీవ్రత పెరిగింది. ఇదివరకు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో వివాదాస్పద, ఏ దేశానికీ చెందని భూభాగాన్ని మాత్రమే తమదంటూ క్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది డ్రాగన్ కంట్రీ. ఇప్పుడు దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించింది. ఏకంగా మొత్తం అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌ రీజియన్‌ను తమదంటూ చెప్పుకొంది.

ఇంకొద్ది రోజుల్లో జీ20 సమావేశం ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. భారత్.. ఈ సమ్మిట్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఇందులో పాల్గొనడానికి జీ20 సభ్య దేశాల అధినేతలు, ప్రధానమంత్రులు భారత్‌కు రావాల్సి ఉంది. చైనాకూ జీ20లో సభ్యత్వం ఉంది. ఆ దేశాధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్, విదేశాంగ శాఖ మంత్రి భారత్‌కు వస్తారనే అంచనాలు వెలువడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాప్ విడుదల కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇటీవలే దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ భేటీలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గ్ఝి జిన్‌పింగ్ భేటీ అయ్యారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఈ సమావేశం ముగిసీ ముగియగానే చైనా తన తెంపరితాన్ని ప్రదర్శించడం, అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌ను తమదేనంటూ అధికారికంగా మ్యాప్‌ను విడుదల చేయడం దుమారం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+