అరుణాచల్ ప్రదేశ్ దగ్గరలో చైనా ఎక్స్‌ప్రెస్ వే, ఎందుకంటే

చైనా టిబెట్‌లో 409 కి.మీ. పొడవైన కొత్త ఎక్స్‌ప్రెస్‌ రోడ్డును ఆదివారం ప్రారంభించింది. సుమారు రూ.37 వేల కోట్లతో ఈ రహదారిని నిర్మించారు.

బీజింగ్: చైనా టిబెట్‌లో 409 కి.మీ. పొడవైన కొత్త ఎక్స్‌ప్రెస్‌ రోడ్డును ఆదివారం ప్రారంభించింది. సుమారు రూ.37 వేల కోట్లతో ఈ రహదారిని నిర్మించారు.

న్యింగ్‌చి నుంచి లాసా వరకు

న్యింగ్‌చి నుంచి లాసా వరకు

ఇది అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులకు సమీపంలోని న్యింగ్‌చి నగరాన్ని టిబెట్‌ రాజధాని లాసాతో కలుపుతుంది. ఫలితంగా రోడ్డు మార్గంలో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణకాలం మూడు గంటలు తగ్గనుంది. కొత్త రహదారిపై భారీ ట్రక్కుల ప్రయాణాన్ని తాత్కాలికంగా నిషేధించారు.

 సైనిక సామాగ్రి రవాణాకు అనుకూలం

సైనిక సామాగ్రి రవాణాకు అనుకూలం

సైనిక సామగ్రి రవాణాకు ఈ మార్గం అత్యంత అనుకూలంగా ఉండటం గమనార్హం. న్యింగ్‌చి నుంచి లాసాకు ఇదివరకు ఎనిమిది గంటల సమయం పట్టేది. ఈ రోడ్డుపై గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఇప్పుడు ఐదు గంటల సమయం పడుతుంది.

 గగనతల అంబులెన్స్ ప్రారంభించారు

గగనతల అంబులెన్స్ ప్రారంభించారు

మరోవైపు, అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు సేవలందించేందుకుగాను లాసాలో గగనతల అంబులెన్స్‌ కేంద్రాన్ని రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో ఆదివారం ప్రారంభించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

 రెండు హెలికాప్టర్లు నిరంతరం సిద్ధంగా

రెండు హెలికాప్టర్లు నిరంతరం సిద్ధంగా

వైద్య పరికరాలతో కూడిన రెండు హెలికాప్టర్లు ఈ కేంద్రంలో నిరంతరం సిద్ధంగా ఉంటాయని తెలిపారు. రోగులను ఇవి 600 కి.మీ. వరకు చేరవేయగలవని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+