రష్యాపై ఆంక్షలు సరికాదు.. చైనా మద్దతు, స్విప్ట్ సేవల గురించి కూడా
ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్దం కంటిన్యూ అవుతుంది. చర్చలు విఫలం కాగా.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కూడా సమావేశమైంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. చైనా మాత్రం సపోర్ట్ చేస్తోంది. రష్యాను కట్టడి చేయడానికి అమెరికా, దాని మిత్రపక్ష దేశాలు విధించిన ఆంక్షలను చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తప్పుబట్టారు.

హక్కులను హరించడమే..
ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కరించడానికి రష్యాపై అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ప్రకటించిన ఆంక్షలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా లేవన్నారు. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం పరిష్కారంలో చైనా, ఇతర పక్షాల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలకు హాని కలిగించొద్దని అమెరికాను డిమాండ్ చేశారు. రష్యాను, రష్యన్ బ్యాంకులను సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్సియల్ టెలీ కమ్యూనికేషన్ (స్విఫ్ట్) సేవల నుంచి బహిష్కరిస్తూ అమెరికా మిత్ర దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ చర్య ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కేవలం ఆటంక పరుస్తుందని వాంగ్ వెన్‌బిన్ అన్నారు.

ఏకపక్ష నిర్ణయం
రష్యా, రష్యన్ బ్యాంకులను స్విఫ్ట్ సేవల నుంచి బహిష్కరించాలని యూరోపియన్ యూనియన్ దేశాలు తీసుకున్న నిర్ణయానికి బ్రిటన్ ప్రభుత్వం సారధ్యం వహించింది. ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆర్థికంగా ఎదురు దెబ్బ తగిలేలా స్విఫ్ట్ సేవల నెట్‌వర్క్ నుంచి ఈయూ దేశాలు బహిష్కరించాయి. భారత్‌తోపాటు 200కి పైగా దేశాల్లో స్విఫ్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 వేల బ్యాంకులకు స్విఫ్ట్ సేవలు లభిస్తున్నాయి. స్విఫ్ట్ సేవలతో అంతర్జాతీయ ఆర్థిక సేవలు స్మూత్‌గా సాగుతున్నాయి. దానిపై ఆంక్షలు విధించగా.. చైనా వెనకేసుకు వచ్చింది. ఇలా చేయడం సరికాదని కామెంట్ చేసింది.

విఫలం
అంతకుముందు రష్యా ఉక్రెయిన్ తొలి దఫా చర్చలు విఫలం అయ్యాయి. ఇటు రష్యా.. అణ్వాయుధాలు ప్రయోగించడానికి సిద్దం అవుతుంది. ఇటు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యవసరంగా సమావేశం జరిగింది. జనరల్ అసెంబ్లీ ఎమర్జెన్సీగా మీట్ కావడం ఇదీ 11వ సారి.. అత్యవసరం అయితే తప్ప సమితి సమావేశం కాదు.
యుద్దం నేపథ్యంలో సభ్యులు అంతా నిమిషం మౌనం పాటించి.. సమావేశం ప్రారంభించారు. తొలుత జనరల్ సెక్రటరీ ఆంటెరియో గుట్రెస్ మాట్లాడారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. కాల్పుల విరమణ చేపట్టాలని స్పష్టంచేశారు. ఇప్పటివరకు జరిగిన ప్రాణ నష్టం చాలు.. యుద్దం ఆపాలని కోరారు. శాంతి ద్వారా ఏదయినా సాధ్యం అవుతుందని ఆయన చెప్పారు. యుద్ధం ఒరిగేది శూన్యం అని ఆయన అభిప్రాయపడ్డారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications