
ప్రత్యక్షమైన జిన్ పింగ్, హౌస్ అరెస్ట్ అని ప్రచారం..
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కనిపించడం లేదని నానా రచ్చ చేశారు. తిరుగుబాటు చేశారని.. జిన్ పింగ్ హౌస్ అరెస్ట్ అనే కథనాలు వచ్చాయి. దీంతో ఆయన మంగళవారం ప్రభుత్వ టీవీలో కనిపించారు. షాంగైలో జరిగిన సమావేశం తర్వాత.. తొలిసారి జిన్ పింగ్ ఆగుపించారు. వచ్చే నెలలో ఎన్నికలు ఉన్నందున ప్రజల్లోకి వచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. గత పదేళ్లుగా జిన్ పింగ్ నేతృత్వంలో పనిచేస్తున్నారు. ఈ కాలంలో చారిత్రక ఘట్టాలు ఆవిష్కృతం అయ్యాయి. ఇందుకోసం మరింత పకడ్బందీగా సిస్టమ్ నెలకొల్పారు.

అంతకుముందు చైనాలో సైనిక తిరుగుబాటు జరుగుతుందని ప్రచారం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ను గృహ నిర్భంధం చేశారు.అంతర్జాతీయ మీడియాలో వస్తున్న ఈ వార్తలతోపెను సంక్షోభం తలెత్తింది.చైనా ఆర్మీ పాలకుడిపై తిరుగుబాటు చేసిందనే ప్రచారం సాగుతోంది. చైనాకు జీవిత కాల అధ్యక్షుడిగా జిన్ పింగ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
జిన్ పింగ్ నియంతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.జిన్ పింగ్ క్రూరంగా ఆలోచిస్తారని అంటారు. నియంత పోకడలు పెరగడంతో కమ్యూనిస్టు పార్టీలో తిరుగుబాటు వచ్చిందని తెలుస్తోంది. జిన్ పింగ్ కు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలో తీర్మానం జరిగిందని అంటున్నారు. జిన్ పింగ్ ను సైన్యం హౌజ్ అరెస్ట్ చేసిందని తెలుస్తోంది.ఈ నెల 16న షాంఘై కో ఆపరేషన్ సదస్సు లో పాల్గొని వచ్చారు జిన్ పింగ్.. ఆ సదస్సు నుంచి రాగానే విమానాశ్రయంలో జిన్ పింగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు బీజింగ్ వైపు చైనా సైన్యం కదులుతుండటంతో చైనాలో సంక్షోభం తలెత్తందని అంటున్నారు. చైనా మిలటరీ చేతుల్లోకి వెళ్లిందనే వార్తలు కూడా వస్తున్నాయి.