చైనా పరువు కాపాడుకుందా అంటే..: డొక్లామ్‌పై చైనా మంత్రి ఇలా
దౌత్యపరంగా డొక్లామ్ సమస్యపై ఎంతో హుందాగా వ్యవహరించిన భారత్‌ను మరోసారి చైనా పదేపదే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇరు దేశాల పరస్పర అంగీకారంతో సమస్య పరిష్కారమైంది.
బీజింగ్: దౌత్యపరంగా డొక్లామ్ సమస్యపై ఎంతో హుందాగా వ్యవహరించిన భారత్‌ను మరోసారి చైనా పదేపదే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇరు దేశాల పరస్పర అంగీకారంతో సమస్య పరిష్కారమైంది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలన్నారు.
కానీ బుధవారం చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యి భారత్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. డొక్లామ్ నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని, ముందుముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సుద్దులు చెప్పారు.

చైనా మంత్రికి మీడియా ప్రశ్న
సదరు మంత్రి మీడియాతో మాట్లాడుతుండగా ఓ ప్రశ్న ఎదురైంది. డోక్లామ్ నుంచి వెనక్కితగ్గి చైనా తన పరువు కాపాడుకుందా? అని ప్రశ్నించింది. దీనికి సమాధానమిస్తూ.. డోక్లామ్ సమస్య భారత ఆర్మీ గీత దాటడం వల్ల తలెత్తిందన్నారు. ప్రస్తుతం ఆ సమస్య తొలగిపోయిందని అన్నారు. మీడియాలో ఎన్నో పుకార్లు వస్తాయన్నారు. తాము అధికారికంగా విడుదల చేసిన ప్రకటనే వాస్తవమన్నారు.

భారత్‌తో
తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని చెప్పారు. డోక్లామ్‌పై ఇరు సైన్యాలు తగ్గడంపై మాట్లాడుతూ.. భారతీయులు లేదా చైనా ప్రజల విషయం కాదని, అంతర్జాతీయ ఆకాంక్షలు, చుట్టుపక్కల దేశాల ఆకాంక్షల మేరకు ఉపసంహరణ జరిగిందన్నారు.

డొక్లామ్‌పై భారత్ డేగ కన్ను
డోక్లామ్‌లో చైనా రోడ్డు నిర్మాణం విరమించుకుని వెనుదిరగగా, భారత్ తన సైన్యాన్ని తగ్గించింది. అయితే తమ సైన్యం గస్తీ కొనసాగుతుందని చైనా ప్రకటించింది. భారత్ ఎలాంటి ప్రకటన చేయకుండా సిక్కిం సరిహద్దుల్లోని డోక్లామ్ ఔట్ పోస్టుల వద్ద భారత జవాన్లను కాపలా ఉంచింది. చైనా సైన్యం కదలికలపై డేగ కన్ను వేసేందుకు అనువుగా ఎత్తైన ప్రాంతంలో భారత సైనికులు గస్తీ కాస్తున్నారు.

చైనా కదలికలను బట్టి రంగంలోకి భారత్
'ఇది సిక్కిం-భూటాన్-టిబెట్ ట్రైజంక్షన్‌లోని డోక్లామ్‌కు 500 మీటర్ల దూరం ఉండడం విశేషం. చైనా నుంచి ఎలాంటి కదలికలు కనిపించినా రంగంలోకి దిగేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది. డోక్లామ్‌లో యథాతథ స్థితి కాపాడటమే మన లక్ష్య'మని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వివాదం పరిష్కారం కావడంపై గతంలో చైనా, అమెరికాలో భారత రాయబారిగా పని చేసిన నిరుపమారావు హర్షం వ్యక్తం చేశారు.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications