అంతరిక్షంలో చైనాకు చిన్న షాక్ - ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ ప్రయోగం విఫలం
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్, అమెరికాలకు దీటుగా ప్రయత్నాలు చేస్తోన్న చైనాకు చిన్న షాక్ తగిలింది. డ్రాగన్ దేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శాటిలైన్ ప్రయోగం విఫలమైంది. చైనా గోబీ ఎడారిలోని ప్రఖ్యాత జిక్వాన్ శాటిలైట్ సెంటర్ నుంచి శనివారం(స్థానిక కాలమానం ప్రకారం) మధ్యాహ్నం చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం ఫెయిలైన విషయాన్ని అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ స్వయంగా వెల్లడించడం గమనార్హం.
Recommended Video
చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో శనివారం 'జిలిన్-1 గావోఫెన్ 02సీ' ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. అంతెత్తు నుంచి కూడా భూమ్మీదున్న వాటిని చూపగలిగే సామర్థ్యమున్న ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం కావడంతో ఈ ప్రయోగాన్ని చైనా కీలకంగా భావించింది.

క్వాయ్‌జావ్-1ఏ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టగా.. రాకెట్ నిర్ణీత కక్ష్యను చేరుకోవడంలో మాత్రం విఫలమైంది. కాగా, రాకెట్ నింగిలోకి ఎగురగానే దానిలోని సాంకేతిక లోపాలను గుర్తించామని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రయోగం విఫలమవడానికిగల కారణాలపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.
ఇదే జిక్వాన్ అంతరిక్ష కేంద్రం నుంచి గతవారం చైనా చేసిన ఓ వినూత్న ప్రయోగం మాత్రం సక్సెస్ అయింది. గత శుక్రవారం లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ ద్వారా ప్రయోగించిన పునర్వినియోగ అంతరిక్షనౌక.. రెండ్రోజులపాటు నిర్దేశిత కక్ష్యలో పరిభ్రమించిన అనంతరం విజయవంతంగా భూమిపైకి తిరిగొచ్చింది. పునర్వినియోగ వ్యోమ నౌక సాంకేతిక పరిశోధనలో దీన్నొక కీలక ముందడుగుగా చైనా అధికారిక మీడియా వెల్లడించింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications