చైనాలోని జిన్‌జియాంగ్‌లో బురఖాల నిషేధం!
బీజింగ్: చైనాలోని ఉయ్‌గర్ జాతికి చెందిన ముస్లింలు ఎక్కువగా నివసించే జిన్‌జియాంగ్ ప్రావిన్స్ రాజధానిలో బుర్ఖాలను అధికారులు బహిష్కరించనున్నారు. అయితే అది ముమ్మాటికి వివక్షే అని విమర్శకులు, ఆ వర్గాలు దీనిపై మండుపడుతున్నాయి.
ఇటీవలి కాలంలో జరిగిన మత కలహాల్లో వందలమంది చనిపోయిన నేపథ్యంలో ఎలాగైనా వాటిని ఆపి తీరాల్సిందేనన్న సంకల్పంతో ఉన్న చైనా ప్రభుత్వం ఈ దిశగా అడుగేసింది.
ఉరుంఖీ పట్టణ అధికారులు.. ఉరుంఖీలో బహిరంగంగా బుర్ఖా వేసుకోవడాన్ని నిషేధించేందుకు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. వాటిని ప్రాంతీయ అధికారులకు చూపించి ఆమోదం పొందిన వెంటనే ఆ మార్గదర్శకాలను అమలు చేయనున్నారు.

మహిళలు బుర్ఖాలు ధరించకుండా ఉండేందుకు చైనా అంతకుముందు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించింది. అంతేకాదు బుర్ఖాలు ధరించిన మహిళల వివరాలను పొందుపరిచింది. బుర్ఖాను నిషేధిస్తూ జిన్‌జియాంగ్‌కు చెందిన అత్యధిక అధికారులు గురువారం ఓటేశారు.
బంగ్లా నదిలో ఆయిల్ ట్యాంకర్ మునక
బంగ్లాదేశ్‌లో షెలానదిలో ఓ ఆయిల్ ట్యాంకర్ మునిగిపోయింది. రవాణా నౌక ఒకటి ఢీకొట్టడంతో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. దీంతో 3.5 లక్షల లీటర్ల ఫర్నేస్ ఆయిల్ నదిలో ఒలికిపోయింది. విపరీతంగా మంచు కురుస్తుండటంతో ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. సుందర్‌బన్ అడవుల్లో చాంద్‌పాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది. దీని కారణంగా వన్యప్రాణులకు ముప్పు తప్పకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications