చైనా శాశ్వత అధ్యక్షుడిగా.. జీ జిన్‌పింగ్! పార్టీ ప్రతిపాదన, నిబంధనలు పక్కకి, రాజ్యంగ సవరణ!

బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కొత్త ఎత్తుగడ వేశారు. తన అధికారం చేజారకుండా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే చైనా కమ్యూనిస్టు పార్టీపై పట్టు సాధించిన ఆయన అధ్యక్షుడిగా ఆ పదవిలో శాశ్వతంగా కొనసాగేందుకు పావులు కదుపుతున్నారు.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రస్తుతం రెండోసారి ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన పదవీకాలం పూర్తవనుంది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా వ్యవస్థాపకుడు మావో సె టుంగ్ తర్వాత దేశంలో అత్యంత శక్తిమంతమైన నేత హోదాను పొందిన జీ జిన్‌పింగ్ ఇప్పుడు తన పదవిని శాశ్వతం చేసుకునే దిశగా అడుగులేస్తున్నారు.

 వరుసగా రెండుసార్లు మాత్రమే...

వరుసగా రెండుసార్లు మాత్రమే...

చైనాలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో ఏ వ్యక్తి అయినా కేవలం రెండుసార్లు మాత్రమే కొనసాగుతారు. రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భావం నుంచీ ఇదే నిబంధన అమలవుతోంది. అయితే ఇప్పుడు తొలిసారిగా ఈ నిబంధనను పక్కన పెట్టి 64 ఏళ్ల వయసున్న ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ఆ దేశ శాశ్వత అధ్యక్షుడుగా ఎన్నుకోనున్నారు. ఇదే గనుక జరిగితే కేవలం దేశాధ్యక్షుడిగానే కాదు అంతకంటే శక్తిమంతమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా జనరల్ సెక్రెటరీగా కూడా శాశ్వతంగా ఆయనే కొనసాగుతారు.

 రాజ్యంగ సవరణ చేసి మరీ...

రాజ్యంగ సవరణ చేసి మరీ...

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కోసం ఆదినుంచీ అమలవుతోన్న ‘వరుసగా రెండుసార్లు మాత్రమే ' నిబంధనకు చరమగీతం పాడేందుకు కూడా చైనా కమ్యూనిస్టు పార్టీ వెనుకాడడం లేదు. ఇప్పటికే మావో సె టుంగ్ తర్వాత దేశంలో అత్యంత శక్తిమంతమైన నేత హోదాను కట్టబెట్టిన చైనా కమ్యూనిస్టు పార్టీ తాజాగా జీ జిన్‌పింగ్‌కు దేశ అధ్యక్షుడిగా శాశ్వత హోదా కట్టబెట్టే దిశగా సాగుతోంది.

 ఇక ఆయనకు ఎదురుండదు...

ఇక ఆయనకు ఎదురుండదు...

ఇప్పటికే చైనా అధ్యక్ష పదవిలో జీ జిన్‌పింగ్ రెండోసారి కొనసాగుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన పదవీకాలం ముగియనుంది. అయితే ఆయన పదవీకాలం ముగియకుండా రాజ్యాంగాన్ని సవరించాలని 205 మంది సభ్యులు ఉన్న చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ ప్రతిపాదించినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ‘జిన్హువా' తెలిపింది. ఇదేగనుక జరిగితే జీ జిన్‌పింగ్ అధికారానికి ఇక ఎదురుండదు. ఇక ఎన్నేళ్లయినా ఆయన చైనా అధ్యక్షుడిగా కొనసాగే వీలు కలుగుతుంది.

రాజ్యాంగ సవరణకే మొగ్గు...

రాజ్యాంగ సవరణకే మొగ్గు...

నిజానికి రెండుమార్లు అధ్యక్షుడిగా ఉన్న జీ జిన్‌పింగ్ ఆ పదవి నుంచి దిగిపోయినా తెర వెనుక నుంచి ప్రభుత్వాన్ని నడపొచ్చు. అయినాకానీ అధ్యక్షుడు ఇందుకు సుముఖంగా లేరు. దేశ అధ్యక్ష పదవిని శాశ్వతంగా చేజిక్కించుకునేందుకే ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా మార్చి 5న ప్రారంభ‌మయ్యే పార్ల‌మెంటు స‌మావేశాల్లో మ‌రోసారి జీ జిన్‌పింగ్ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక అయ్యే అవ‌కాశం ఉంది. ఈ మార్పు అనివార్య‌మ‌ని భావించి క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఈ త‌ర‌హా నిర్ణ‌యానికే మొగ్గుచూపిందని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+