జర్మనీ ఎయిర్ క్రాఫ్ట్ పై లేజర్ అస్త్రంతో చైనా దాడి
చైనాపై జర్మనీ కీలక వ్యాఖ్యలు చేసింది. చైనాకు చెందిన మిలిటరీ నౌక జర్మనీకు చెందిన నిఘా విమానంపై లేజర్ అస్త్రం ప్రయోగించిందని తెలిపింది. యూరోపియన్ యూనియన్ మిషన్ లో భాగంగా ఎర్ర సముద్రంలో గస్తీ కాస్తున్న తమ సైనిక విమానంపై చైనా నౌక లేజర్ అస్త్రం ప్రయోగించిందని జర్మనీ తెలిపింది. చైనా లేజర్ యాక్షన్ వల్ల తాము ఇబ్బంది పడినట్లు పేర్కొంది.
యెమెన్ దేశంలో తిరుగుబాటు దళం అయిన హౌతీ రెబెల్స్ పెను విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఇరాన్ మద్దతుతో హౌతీలు ఎర్రసముద్రంలో విధ్వంసం చేస్తున్నారు. దీంతో వీరి స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) దాడులు చేస్తోంది. అయితే హౌతీల భయం నేపథ్యంలో జర్మనీ ఎయిర్ క్రాఫ్ట్ లు ఎర్ర సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నాయి.
ప్రజా రవాణా నౌకలే లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తున్న నేపథ్యంలో జర్మనీ ఆ నౌకలను రక్షణ కల్పిస్తోంది. ఈ క్రమంలో ఎర్రసముద్రంలోని చైనా నౌక నుంచి గస్తీ నిర్వహిస్తున్న తమ ఎయిర్ క్రాఫ్ట్ పై లేజర్ తో దాడులు జరిపిందని జర్మనీ పేర్కొంది. ఈ మేరకు జర్మనీ రాజధాని బెర్లిన్ లోని చైనా దౌత్య అధికారికి ఆదేశాలు ఇచ్చింది. వివరణ ఇవ్వాలని పేర్కొంది.

ఈ నెల మొదటి వారంలో చైనా నౌక నుంచి తమ విమానానికి పదే పదే లేజర్ అస్త్రంతో దాడులు ప్రయోగించిందని జర్మనీ డిఫెన్స్ అధికారులు పేర్కొన్నారు. హౌతీ దాడుల నేపథ్యంలో ప్రజల్ని తరలించేందుకు ఈ విమానం ఏర్పాటు చేశామని.. చైనా లేజర్ ప్రయోగంతో ముందు జాగ్రత్తగా ఎయిర్ క్రాఫ్ట్ ను జిబోటి దేశంలో ల్యాండింగ్ చేశామని జర్మనీ పేర్కొంది.
🚨 #BreakingNews 🚨 Chinese military shoots laser at German jet during Operation ASPIDES, Berlin summons China’s ambassador https://t.co/tA5zi6uP5r
— Instant News ™ (@InstaBharat) July 8, 2025
Germany alleges that China targeted its aircraft with a laser. The incident occurred during a European Union maritime security op…
తమ విమానం మిలిటరీ దాడులకోసం వెళ్లలేదని.. ఎర్రసముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్, ఇండియన్ ఓషియన్ లో సరుకు రవాణా.. ఇతర కమర్షియల్ వస్తువుల రవాణా నౌకలకు గస్తీగా ఏర్పాటు చేశామని జర్మనీ అధికారులు పేర్కొన్నారు. హౌతీ రెబెల్స్ దాడులతో ఎర్ర సముద్రంలోని దక్షిణ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు జర్మనీ పేర్కొంది.
అయితే జర్మనీ వ్యాఖ్యలపై చైనా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు లిబేరియా జెండా ఉన్న నౌకపై ఎర్రసముద్రంలో హౌతీలు దాడులు చేశారు.












Click it and Unblock the Notifications