చైనా నిర్ణయం: పడిపోయిన కండోమ్ కంపెనీ షేర్లు

న్యూఢిల్లీ: దశాబ్దాలుగా అమలు చేస్తున్న 'ఒక జంటకు ఒకే బిడ్డ' విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించడంతో గతవారంలో అక్కడి కండోమ్ కంపెనీలు షేర్లు పడిపోయాయి. అంతేకాదు చిన్నారులకు సంబంధించిన ఉత్పత్తులను రూపొందించే కంపెనీలు భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.

చైనాలో 1979 నుంచి అమలవుతున్న వివాదాస్పద కుటుంబ నియంత్రణ విధానంపై విధించిన ఆంక్షలను చైనా ప్రభుత్వం ఎత్తివేస్తూ, ఇకపై దంపతులందరూ ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత గరువారం బీజింగ్‌లో జరిగిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో జపాన్‌కు చెందిన ప్రముఖ కండోమ్ తయారీదారు 'ఒకామోటో' షేర్లు ఒక్కసారిగా పది శాతం పతనమయ్యాయి.

చైనీస్ టూరిస్ట్‌లకు ఈ కండోమ్‌లంటే ఎంతో ఇష్టం. ప్రత్యేకించి సెక్స్‌లో చైనా టూరిస్ట్‌లు ఈ కండోమ్‌లనే ఎక్కువగా వినియోగిస్తారట. అయితే చైనాలో చిన్న పిల్లల చర్మం, హెయిర్‌లకు సంబంధించిన ఉత్పత్తులను తయారుచేసే చైనా చైల్డ్ కేర్ కార్పోరేషన్ సంస్ధ షేర్లు హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో ఒక్కసారిగా 40 శాతం ఎగబాకాయి. షాంఘైలోని బేబీ స్టోర్ మేనేజర్ ఈ తాజా పరిమాణాలపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

China Two-Child Policy: Baby Food Makers' Gain Is Condom Makers' Loss

చైనా ప్రభుత్వ నిర్ణయంతో త్వరలో ప్రజలకు మరింతగా బేబీ దుస్తులు, మిల్క్ పౌడర్, నాప్పిస్ అవసరమవుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ నిర్ణయంతో చైనాలోని రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకుంది. అయితే రెండో బిడ్డను కనేందుకు తొందర పడొద్దని చైనా ప్రభుత్వం హెచ్చరించింది. వచ్చే ఏడాది మార్చి నెల వరకు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసింది.

కొత్త కుటుంబ నియంత్రణ విధానం వచ్చే ఏడాది మార్చి నుంచి అమల్లోకి వస్తుందని, అప్పటి వరకు తొందర పడొద్దని హెచ్చరించింది. 35 ఏళ్లకు పైగా అమలులో ఉన్న ఒకే బిడ్డ విధానాన్ని చైనా ఎత్తేయడం ఇదే తొలిసారి. వివాదాస్పదమైన ఈ విధానం వల్ల గతంలో చైనాలో బలవంతపు గర్భస్రావాలు సర్వసాధారణమయ్యాయి.

గతేడాది విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం చైనాలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య 18.5 కోట్లు. జనాభాలో 13.7 శాతం వరకు వృద్ధులే. ఈ ఏడాది వీరిసంఖ్య 22 కోట్లు దాటింది. ఇందులో 5 కోట్లమంది వృద్ధులు పిల్లలకు దూరంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇదేతీరు కొనసాగితే వృద్ధుల జనాభా 2050 నాటికి 44 కోట్లకు చేరుకుంటుంది.

దీంతో వారి ఆలనాపాలనా చూసేవారెవరనేది పెద్ద సమస్యగా మారడంతో ఈ ఒకే బిడ్డ విధానాన్ని పూర్తిగా రద్దుచేసింది. అయితే వృద్ధుల జనాభా పెరుగుతుండటం, శ్రమచేయగలిగే వయోజనుల సంఖ్య తగ్గిపోవడం ఈ విధానపరమైన మార్పులకు కారణమని భావిస్తున్నారు. దీంతో పాటు మహిళా జనాభా గణనీయంగా పడిపోవడం కూడా మరో ముఖ్యకారణం.

దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు గత వారం చైనా ప్రభుత్వం కుటుంబ నియంత్రణ చట్టంలో సమూల మార్పులు చేస్తున్నట్లు ప్రకటిస్తూ, 'ఒక జంటకు ఒకే బిడ్డ' విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+