టూరిస్టుకు వేధింపు: చైనాలో ఇద్దరు భారతీయులు అరెస్ట్

Subscribe to Oneindia Telugu

బీజింగ్‌: తైవాన్‌ టూరిస్టును వేధించిన కేసులో ఇద్దరు భారతీయులను చైనా పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు భారత్‌కు చెందిన టీ కంపెనీలో పనిచేసేందుకు బీజింగ్‌ వెళ్లారు.

జులై 7న వారు పనిచేస్తున్న హోటల్‌లో లిఫ్ట్‌ వద్ద తైవాన్‌కు చెందిన మహిళా టూరిస్టుతో ఫొటో దిగుతూ.. అసభ్యంగా ప్రవర్తించారు. వారి బారి నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించి ఘటనపై ఫిర్యాదు చేసింది.

China: Two Indian men held for attempting to molest woman

సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వీరి అరెస్ట్ పై భారత ఎంబసీకి ఇంకా సమాచారం అందనట్లు సమాచారం.

జులై 14 వరకు నిందితులు పోలీసుల అదుపులోని వీరు ఉండనున్నారు. ఆ తర్వాత వీరిని విడిచిపెట్టి ఆ దేశంలో ఉండనిస్తారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two Indian men have been detained by Chinese police for allegedly trying to molest a Taiwanese tourist in the lift of a hotel.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి