దోమ సైజులో డ్రోన్.. యుద్ధ రంగంలో చైనా అద్భుత సృష్టి.. ఆ దేశంపై టార్గెట్..?
ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తల కంటే ఓ అడుగు ముందున్నట్లు చైనాలోని శాస్త్రవేత్తలు సంకేతాన్నిచ్చారు. ప్రపంచంలోనే అతి చిన్న సైజు డ్రోన్ లను తయారు చేసింది. దోమ సైజులో ఉండే ఈ డ్రోన్ లు యుద్ధ రంగంలో సమర్థవంతంగా పనిచేస్తాయని డ్రాగన్ భావిస్తోంది. ఈ డ్రోన్ లను మిలిటరీలో వినియోగించనున్నట్లు చైనా పేర్కొంది. అత్యంత చిన్న సైజులో చూడటానికి దోమ సైజులో ఇవి ఉంటాయి.
చైనా శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. ప్రపంచంలోనే అతి చిన్న సైజు డ్రోన్ ను తయారు చేశారు. ఈ డ్రోన్ దోమ సైజులో ఉంటుంది. మిలిటరీ ఆపరేషన్స్ కోసం ఈ డ్రోన్ లను తయారు చేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు పత్రిక పేర్కొంది. ఈ మైక్రో డ్రోన్ ను చైనాలోని హునాన్ ప్రావిన్స్ లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీలోని రోబోటిక్ శాస్త్రవేత్తలు రూపొందించారు.

చైనా రూపొందించిన ఈ మైక్రో సైజు డ్రోన్ లను మిలిటరీ, డిఫెన్స్ రంగాలతో పాటు అనేక రంగాల్లో వినియోగించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ డ్రోన్ లకు అసాధారణ శక్తి సామర్థ్యాలు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు ఈ డ్రోన్ వివరాలను చైనా మిలిటరీ ఛానెల్ సీసీటీవీ-7 లైవ్ ప్రదర్శన చేసింది. ఈ డ్రోన్ కు దోమ మాదిరి రెండు రెక్కలు, ఆకు ఆకారంలో రెక్కలు ఉన్నాయి. రెండు కాళ్లు ఉన్నాయి.
ఈ డ్రోన్ లను యుద్ధరంగంలో ప్రత్యేకమైన ఆపరేషన్స్ ను నిర్వహించేందుకు చైనా వాడనుంది. వీటిని మొబైల్ ఫోన్ ల ద్వారా కంట్రోల్ చేస్తుంది. ఇలాంటి అతి చిన్న డ్రోన్ లు కోవర్టు ఆపరేషన్స్ కు బాగా ఉపయోగపడతాయని చైనా భావిస్తోంది. ఇవి ఎలాంటి వాతావరణ పరిస్థితిని అయినా తట్టుకుని సైనికులకు సమాచారం అందించగలవు. వీటికి చుట్టూ సెన్సార్లు అమర్చారు. ఇవి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాక ఈ డ్రోన్ లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి రూపొందించారు.
The Chinese military unveils a tiny drone the size of a mosquito.
— Alexeï (@jeanlol67573289) June 21, 2025
The creators believe such a drone is nearly impossible to detect, making it ideal for reconnaissance. A compact handheld device is all that's needed for control.
China is ahead of the rest of the world... pic.twitter.com/thfCzIcchy
ఈ డ్రోన్ లు గూఢ చర్యం చేయడానికి, శత్రువులపై నిఘా పెట్టడానికి ఉపయోగపడనున్నాయి. ఈ డ్రోన్ లు దోమ సైజులో ఉండటం కారణంగా వీటిని గుర్తించడం శత్రువులకు కష్టంగా అనిపిస్తుంది. దీంతో ఇవి సాధారణంగా తమ పని చేసుకుంటూ వెళ్తాయి. భవిష్యత్తు యుద్ధాల్లో డ్రోన్ లు అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్












Click it and Unblock the Notifications