భలే టేస్ట్: నగ్నచిత్రాన్ని రూ. 1100 కోట్లకు కొన్న వ్యక్తి
బీజింగ్: కళాత్మక చిత్రాలకు భలే గిరాకీ ఉంటుంది. సౌందర్యాస్వాదకులు ఎంత ధరనైనా చెల్లించి తమకు ఇష్టమైన చిత్రాలను కొంటారని చెప్పడానికి ఓ చైనా కోటీశ్వరుడే ఉదాహరణ. చైనాలో లీ యిక్వియాన్ అనే వ్యక్తి ఏకంగా రూ.1100 కోట్లు వెచ్చించి నగ్న చిత్రాన్ని కొనుగోలు చేయడం సంచలనం రేపుతున్నది.
డాలర్లలో దాని విలువ 170 మిలియన్లు. గతంలో కూడా క్రెడిట్ కార్డును ఉపయోగించి రికార్డు స్థాయి ధరకు అనేక చిత్రాలను కొనుగోలు చేసిన చరిత్ర లీ యిక్వియాన్‌కు ఉంది. అమెడియో మోడిగ్లియా అనే పెయింటర్ గీసిన న్యూడో రోసా (నగ్నంగా ఉన్న మహిళ చిత్రం)ను తన భార్య నిర్వహించే ప్రైవేట్ మ్యూజియం కోసం లీ యిక్వియాన్ కొనుగోలు చేశాడని డాలర్స్‌పిక్ సంస్థ ట్విట్టర్‌లో తెలిపింది.

అయితే గతంలో ట్యాక్సీ డ్రైవర్ అయినా ఈయన ప్రస్తుతం చైనా శ్రీమంతుల జాబితాలో 239వ స్థానాన్ని ఆక్రమించారు. 1980 నుంచి 1990 మధ్య కాలంలో తన తెలివితేటలతో స్టాక్‌మార్కెట్‌లో 9100 కోట్లు (1.38 బిలియన్ డాలర్లు) సంపాదించి ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఆ చిత్రం కోసం అరడజను మంది పోటీ పడ్డారు. ఫోన్ మీదనే వేలం జరిగింది. చివరికి దాన్ని లీ యిక్వియాన్ సొంతం చేసుకున్నారు. ఆయన తన భార్యతో కలిసి షాంఘైలో పేరు మోసిన రెండు ప్రైవేట్ ప్రదర్శనశాలలను నిర్వహిస్తున్నారు. వారిద్దరు చైనాలోని అత్యంత విలువైనవాటిని సేకరించారు.












Click it and Unblock the Notifications