ఉద్యోగుల కోసం టెక్ కంపెనీల్లో చీర్ గర్ల్స్, అన్నీచేస్తారు!
బీజింగ్: ఐపీఎల్ మ్యాచుల్లో చీర్ లీడర్స్ అలరిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు చైనాలోని టెక్ కంపెనీలు తమ కంపెనీల్లో పని చేస్తున్న పురుష ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు చీర్ లీడర్స్‌ను రంగంలోకి దింపుతున్నారు.
తద్వారా పని చేస్తూ ఉంటే పొట్టి స్కర్టులు ధరించిన అందమైన అమ్మాయిలు దగ్గరికి వస్తారు. వారిని అలరిస్తూ మాట్లాడుతారు. ఏమైనా కావాలా అని అడిగి తెలుసుకుంటారు. దానిని క్షణాల్లో తీసుకు వస్తారు. నవ్విస్తారు, అవసరమైతే ఆటలాడుతారు.
చీర్ లీడర్స్... కార్యాలయాల్లో ఉద్యోగులను ఉత్సాహపరిచి వారి నుంచి మరింత ఉత్పాదకతను రాబట్టేందుకు చైనాలోని టెక్నాలజీ కంపెనీలు ఈ కొత్త మార్గాన్ని పాటిస్తున్నాయి. వీరిని ఐటీ ఇండస్ట్రీలో 'ప్రోగ్రామింగ్ చీర్ లీడర్స్' అని పిలుస్తారు.

చైనాలో పలు ఐటీ కంపెనీలు ప్రస్తుతం వీరిని నియమించి ఉద్యోగులకు ఉల్లాసం కలిగిస్తున్నాయని ట్రెండింగ్ ఇన్ చైనా ప్రకటించింది. అందమైన అమ్మాయిలను నియమించిన తర్వాత కంపెనీ వాతావరణం మారిందని, ఉద్యోగులు, ముఖ్యంగా పురుష ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పని చేస్తున్నారని, ప్రొడక్టివిటీ పెరిగిందని ఓ కంపెనీ చెబుతున్నారు.
అయితే, పని పట్ల చిత్తశుద్ధి ఉంటే అందంగా ఉన్న అమ్మాయిలను చూసి పనులు చేస్తారా? అని మహిళలు నిలదీస్తున్నారు. గతంలో ఫ్యాక్టరీల్లో మరింత ఉత్పత్తి కోసం విరామ సమయాల్లో కార్మికులకు అమ్మాయిలను ఎరవేసిన చరిత్ర కూడా చైనాకు ఉంది.












Click it and Unblock the Notifications