ఇదీ ట్రెండేనా..? : సోషల్ మీడియాలో 'న్యూడ్ ఫోటోలు'
బీజింగ్ : ట్రెండ్ పేరుతో టెక్నాలజీని బోల్డ్ నెస్ కి కేరాఫ్ గా మార్చుకుంటున్నారు కొంతమంది చైనీయులు. సెల్ఫీ మోజు నుంచి జనం ఇంకా తేరుకోకముందే, ఇదో కొత్త ట్రెండ్ అంటూ న్యూడ్ ఫోటోలకు తెరలేపారు. అక్కడితో ఊరుకోలేదు వాటిని సోషల్ మీడియాలోకి ఎక్కించి ఇదో నయా ఫ్యాషన్ అని చెప్పుకొచ్చారు.
చివరికి ఆ నోటా.. ఈ నోటా.. విషయం కాస్త పోలీసుల చెవిన పడడంతో ఆ జంటను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని యువాన్ రాష్ట్రంలో నివాసముండే ఓ జంట బహిరంగ ప్రదేశాల్లో తమ న్యూడ్ ఫోటోలను తీసుకుని, వాటిని చైనీస్ సోషల్ మీడియా వైబోలో పోస్ట్ చేశారు. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే డాలి అనే ప్రాంతంలో ఒక హాస్టల్ ముందు, బార్ ముందు, ఓ స్కూల్ ముందు బహిరంగ ప్రదేశాల్లో న్యూడ్ ఫోటోలు దిగారు.

అంతా చేసి.. చివరికి పోలీసుల చేతికి చిక్కాక దీన్నో సరికొత్త కళగా అభివర్ణించుకుని తమని తాము సమర్థించే ప్రయత్నం చేసుకుంది సదరు జంట. ఈ జంట చేసిన పనికి చైనా జనం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాళ్లను తక్షణం చైనా నుంచి బహిష్కరించాల్సిందిగా కొంతమంది సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా పోర్నోగ్రఫీ ప్రచారం కింద సదరు జంటను అరెస్టు చేసిన పోలీసులు 15 రోజుల వరకు అదుపులోనే ఉంచుకోనున్నారు. ఇద్దరికీ రూ.30 వేల వరకు జరిమానా పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications