పెళ్లి షాక్: భారీ కొండ చిలువలను మెడలో వేసుకున్న జంట!

బీజింగ్: వివాహ స‌మ‌యంలో వ‌ధూవ‌రులు పూలదండ‌లు మార్చుకోవ‌డం సాధారణమే. మరికొందరైతే దండలతోపాటు ఉంగ‌రాలు మార్చుకుంటారు. చైనాలో మాత్రం ఓ కొత్త జంట అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. కొండ చిలువలను మెడలో వేసుకుని తమ వివాహానికి అధికమైన ప్రాధాన్యత కల్పించుకున్నారు. ఈ ఘటన చైనాలోని జిలిన్ రాష్ట్రంలో జ‌రిగింది.

ఆ వివరాల్లోకి వెళితే.. తమ పెళ్లి సందర్భంగా బూటు సూటు వేసుకొని వరుడు, పెళ్లి గౌను వేసుకొని వధువు వేదిక‌పైకి వచ్చారు. చ‌క్క‌గా ఉంగ‌రాలు మార్చుకొని పెళ్లి చేసుకుంటార‌నుకున్న వ‌ధూవ‌రులు.. ఏకంగా రెండు కొండ చిలువలను ఒకరి మెడలో మరొకరు వేసుకుని ఒక్కటయ్యారు. వాటిల్లో ఒక కొండ‌చిలువ‌ 30 కిలోలు బ‌రువు ఉండ‌గా, మరొకటి 15 కిలోల బరువు ఉంది.

Chinese Couple Wraps Each Other With Live Golden Pythons for Wedding Photos

30 కిలోల కొండ చిలువను పెళ్లి కూతురైన‌ జియాంగ్ స్యూ మెడ‌లో వరుడు వేయగా, పెళ్లి కొడుకు వు జియాన్ ఫెంగ్ మెడ‌లో 15 కిలోల బంగారు రంగు కొండచిలువను వధువు వేసింది. వాటిని మెడ‌లో వేసుకొని వ‌ధూవ‌రులు సంతోషంతో పొంగిపోయి ఆ కొండ‌చిలువ‌లే తమ బంధానికి ప్రతీకలని అన్నారు.

కాగా, సదరు జంట తమ పెళ్లిలో కొండ చిలువలను మార్చుకుంటుండగా తీసిన వీడియో ఇప్పుడు ఆ దేశంలోని సామాజిక మాధ్య‌మం వైబోతోపాటు యూట్యూబ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఇలా ఎందుకు వివాహం చేసుకున్నారని ప్రశ్నించగా.. వ‌న్య‌ప్రాణి ప్రేమికులమైన తాము వాటిని కాపాడాల‌నే సందేశాన్ని ఇవ్వ‌డానికే ఈ ప‌ని చేసినట్లు కొత్త జంట తెలిపింది. కొండ చిలువ‌ల‌ను త‌మ మెడలో వేసుకొని వాళ్లిద్ద‌రు వేదిక‌పై కౌగలించుకున్నారు కూడా.

ఈ సంద‌ర్భంగా స‌ద‌రు కొత్త పెళ్లి కొడుకు మాట్లాడుతూ.. కొండ చిలువలను ర‌క్షించాల‌ని, వాటిని కొట్టవ‌ద్దని అన్నాడు. అంతేగాక, తమ ఇంట్లో కొన్ని పాములు, బల్లులు, కొండ చిలువలు, పక్షులు, కుందేళ్లు వంటి వ‌న్య‌ప్రాణుల‌ను పెంచుకుంటున్నట్లు తెలిపారు. కాగా, పెళ్లి కొడుకు మెడ‌లో ఉన్న అరుదైన బంగారు రంగు కొండ‌చిలువ‌ బర్మా జాతికి చెందింది. అది ఆల్బినో కావడంతో అది మ‌రో రంగులోకి మారగలదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+