భారీ వర్షాలు: కుప్పకూలిన ఐదంతస్తుల భవనం(వీడియో)
టిబెట్ ప్రాంతంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుఫాను ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాలకు అనేక ప్రాంతాలు నీటమునుగుతున్నాయి.
బీజింగ్: టిబెట్ ప్రాంతంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుఫాను ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాలకు అనేక ప్రాంతాలు నీటమునుగుతున్నాయి.
భారీ వరదల కారణంగా అనేక వాహనాలు కొట్టుకుపోగా, ఏకంగా ఓ అదంస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అయితే, వరదల ధాటికి నానిపోయిన భవనం ఏ క్షణంలోనైనా కూలే అవకాశం ఉందని గ్రహించిన అధికారులు.. భవనంలోని వారిని సురక్షిత ప్రాంతాలకు ముందే తరలించారు.
దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో టిబెట్ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు, భద్రతా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశఆరు.












Click it and Unblock the Notifications