15 మందితో డేటింగ్, అందరూ కాలేజ్ అమ్మాయిలే
బీజింగ్: చైనాకు చెందిన ఓ వ్యక్తి డేటింగ్ పేరుతో 15 మంది యువతులను మోసం చేసిన సంఘటన చైనాలో చోటు చేసుకుంది. అతని వయస్సు 41. అతను పదిహేను మంది విశ్వవిద్యాలయ విద్యార్థినీలతో డేటింగ్ చేసి మోసం చేశాడు.
చైనా రాజధాని బీజింగ్‌కు చెందిన తయాన్ డేటింగ్ పేరుతో పదిహేను మంది మహిళలను మోసం చేశాడని పోలీసులు తెలిపారు. వారిలో ఒక మహిళతో నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. ఆమె వద్ద నుంచి అతను 5900 డాలర్లకు పైగా నగదును కూడా తీసుకున్నాడు.

దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది తయాన్‌కు 18 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. అతను డేటింగ్ చేసే వారంతా విశ్వవిద్యాలయ విద్యార్థినీలే కావడం గమనార్హం. ఓ ఆన్ లైన్ సర్వీసు ద్వారా తయాన్ యువతులతో పరిచయం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతను చైనాకు చెందిన రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన అమ్మాయిలతోను డేటింగ్ చేశాడు. అతను క్యూక్యా అనే ఇన్‌స్టాంట్ ఆన్ లైన్ సర్వీసు ద్వారా వారితో పరిచయం ఏర్పరుచుకున్నాడు.












Click it and Unblock the Notifications