షాకింగ్: గ్రహణమొర్రితో పుట్టాడని బాలుడి హత్య
బీజింగ్ : గ్రహణ మొర్రి(చీలిన పెదవి)తో పుట్టాడని మనువడిని తాత హత్య చేశాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. మనువడు పుట్టిన మూడో రోజే ఈ ఘటన జరిగింది. గ్రహణ మొర్రితో జులై 14న బాలుడు జన్మించాడు. దీంతో తాత విసుగు చెంది అ బాలుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
డాక్టర్ సహాయంతో సెలైన్‌లో ప్రాణాంతకమైన రసాయనాన్ని(పొటాషియం క్లోరైడ్) బాలుడికి ఎక్కించాడు. దీంతో బాలుడు జులై 17న మృతి చెందాడు. ఈ ఘటనకు పాల్పడిన తాతను, డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే గ్రహణ మొర్రితో జన్మించిన పిల్లలకు మూడు నెలల్లోపు శస్త్ర చికిత్స చేయించాలి. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా చెవి, నోటికి సమస్యలు వస్తాయి. గ్రహణ మొర్రి రావడానికి కారణం అనువంశిక లోపాలైనా, ఇతర కారణాలు ఉండవచ్చు.
ఈ లోపంతో బిడ్డ పుట్టిన తర్వాత మాత్రం అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. నోరు సరిగా మూసుకోకపోవడం, చెవి సంబంధ సమస్యలు వస్తాయి. బాలుడు జులై 14వ తేదీన పుట్టగా 17వ చైనాలోని షాంఘై చోంగ్‌మిగ్ కౌంటీ ఆస్పత్రిలో బాలుడిని చంపేశారు.












Click it and Unblock the Notifications