వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4 టన్నుల నాణేలు పొదుపు చేసి కారు కొన్నాడు(వీడియో)

|
Google Oneindia TeluguNews

బీజింగ్: అతని కారు కొనాలనేది ఓ కోరిక. దీంతో అతను చేసే ఉద్యోగం ద్వారా వచ్చే టిప్స్(నాణేల రూపంలో) అన్నింటినీ దాచుకున్నాడు. ఏకంగా నాలుగు టన్నుల నాణేలను అతడు జమ చేశాడు. ఇక ఇవన్నీ కలిపితే తన కారు కల సాకరమవుతుందోని షోరూంకి వెళ్లాడు. అయితే అక్కడి సిబ్బందికి మాత్రం ఇన్ని నాణేలు ఒకసారి దిమ్మ దిరిగిపోయింది.

ఇవన్నింటినీ ఎలా లెక్కబెట్టాలిరా.. దేవుడా! అనుకున్నారు. ఎంతో శ్రమించి లెక్కించారు. అతని కారు కల నెరవేర్చారు. ఈ ఘటన చైనా దేశంలో చోటు చేసుకుంది. చైనా మీడియా తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

చైనాలోని లోయనింగ్‌ ప్రావిన్సెస్‌ షెన్యాంగ్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కారు కొనడానికి బయలు దేరాడు. ఆ కారు విలువ. 1.40లక్షల డాలర్లు. అంత పెద్ద మొత్తంలో చైనా యెన్‌ నాణాల్ని లెక్కపెట్టి సిద్ధం చేసుకున్నాడు.

నాలుగు టన్నుల బరువున్న ఆ నాణేల్ని ఓ ట్రక్కు నిండా నింపుకొని కారు స్టోర్‌ ముందుకు గుమ్మరించాడు. కారు స్టోర్‌కు చెందిన పది మంది సిబ్బంది వాటిని లెక్కపెట్టుకుని కారును అప్పజెప్పే సరికి వారి తల ప్రాణాలు తోకకొచ్చేశాయి.

Chinese man saved £70,000 in COINS to buy a new car

ఇన్ని నాణేల్ని ఎక్కడి నుంచి తెచ్చారని అడిగితే.. 'తాను ఓ గ్యాస్‌ స్టేషన్‌లో పనిచేసేవాడినని వాహనాలకు గ్యాస్‌ నింపిన తర్వాత వారు తనకు టిప్‌గా నాణేలు ఇచ్చేవారని, వాటిని పొదుపు చేసి అలా దాచుకున్న నాణేలన్నింటితోనే ఇప్పుడు కారు కొన్నట్లు ఆ వ్యక్తి తీరిగ్గా తెలిపాడు.

English summary
We've all dreamed about how much we could save through all those pennies stored up in the piggy bank. But one man in north east China has taken this to the extreme by buying a new car worth 680,000 Yuan (£70,000) using coins.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X