భవనంపై నుంచి పడుతున్న బేబీని పట్టుకున్నారు

బీజింగ్: చైనాలో ఓ అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. భవనం రెండో అంతస్థు నుంచి వడుతున్న చిన్నారిని ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నారు. దానికి సంబంధించిన చిత్రాలను చైనా ప్రభుత్వ మీడియా శుక్రవారం విడుదల చేసింది.

గాంగ్‌డాంగ్‌లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుండగా ఓ వ్యక్తి భవనం వైపు నడుస్తుండగా కిటికీలో ఓ బాలుడు కిటికీ పైకి ఎక్కి కనిపించాడని ప్రొవిన్షియల్ బ్రాడ్‌కాస్టర్ గాంగ్‌డాంగ్ టివీ తెలిపింది. వీడియో ఫుటేజ్ చిత్రాలు ఆ వ్యక్తికి మరో వ్యక్తి తోడు కావడాన్ని చూపిస్తోంది. బాలుడు పడుతుండగా చేతులు చాచారు.

Chinese men catch baby falling from building

చివరికి ఆ బాలుడు వారి చేతుల్లో పడ్డాడు. ఆదివారం ఈ సంఘటన జరిగింది. తన తల్లి కోసం వెతుకుతూ ఆ ఏడాది బాలుడు కిటికీ పైకి ఎక్కాడని అంటున్నారు.

ఆ సమయంలో తాను ఏమీ ఆలోచించలేదని, పట్టుకోగలనా లేదా అనే భయపడ్డానని బాలుడిని రక్షించిన వ్యక్తి అన్నాడు. సోషల్ మీడియాలో ఆ వీడియో హల్‌చల్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+