ఓ తల్లి ప్రాణం తీసిన ఎస్కలేటర్(వీడియో)

బీజింగ్: చైనాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కొడుకుతో ఎస్కలేటర్‌పై నుంచి వస్తున్న ఓ మహిళ ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. ఎస్కలేటర్‌పైకి వచ్చిన తర్వాత ఆ పైభాగం తెరచుకోవడంతో ఆ తల్లి లోపలికి వెళ్లిపోయింది. ఆ సమయంలోనూ తన కొడుకును కాపాడుకుంది ఆ తల్లి. తన కొడుకును అక్కడేవున్న షాపు సిబ్బందివైపు నెట్టి.. ఆమె తన ప్రాణాలు పోగొట్టుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌కు తన కొడుకుతోపాటు వచ్చిన జియాన్ లౌజన్ (30)పై ఫ్లోర్‌కు వెళ్లడానికి ఎస్కలేటర్ ఎక్కింది. అయితే చివరి వరకు వచ్చిన తర్వాత హఠాత్తుగా పైన ఉండే రాక్ ఊడిపోయింది. దీంతో అప్రమత్తమైన జియాన్ తన కొడుకును పైన ఉన్న సిబ్బందిపైకి విసిరేసింది. వారు వెంటనే అతణ్ని పట్టుకుని రక్షించారు.

అయితే ఎస్కలేటర్ కిందకు రోల్ అవుతుండడంతో ఆమె అందులో పడిపోయి కిందకు వెళ్లిపోయింది. సిబ్బంది అమెను లాగడానికి ప్రయత్నించినా.. కుదరలేదు. ఆమె మరణించిందా, లేక బతికే ఉందా అనే విషయం తెలుసుకోవడానికి చాలా సమయమే నిరీక్షించాల్సి వచ్చింది. నాలుగు గంటల పాటు కష్టపడి ఆ మెషీన్ మొత్తాన్నీ కత్తిరించారు.

ఆమె శరీరం అప్పటికే నుజ్జునుజ్జయిపోవడంతో మరణించింది. ఈ విషయం చైనా మొత్తం హాట్ టాపిక్‌గా మారిపోయింది. సీసీటీవీ ఫుటేజ్‌ను యూట్యూబ్‌లో చూసిన నెటిజన్లు స్టోర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆ మహిళ అందులోకి జారిపోవడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే ఎస్కలేటర్‌ను ఎందుకు ఆపలేదు‘ అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సదరు డిపార్ట్‌మెంటల్ స్టోరే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+