విమానంలో ఉన్నానని మరిచిపోయి.. కోరిక ఆపులేక టాయ్‌లెట్ లోనే!

బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్ ఏసియా విమానంలో చైనాకు వెళ్లిన వాంగ్(54) ఈ చర్యకు పాల్పడ్డాడు.

బీజింగ్: స్మోకింగ్‌కు అలవాటు పడినవారు.. ఎక్కడికెళ్లినా ఓ సిగరెట్ వెలిగించనిదే ఏ పని చేయరు. ఎంత తప్పనిసరి పరిస్థితుల్లో అయినా సరే దొంగచాటుగానైనా పని కానిచ్చేయడానికి తహతహలాడుతుంటారు. ఇదే కోవకు చెందిన ఓ చైనా వ్యక్తి తాజాగా జైలు పాలయ్యాడు.

ఏకంగా విమాన ప్రయాణంలోనే అతగాడు సిగరెట్ స్మోకింగ్ చేయడాన్ని అక్కడి అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో అతనికి ఐదు రోజుల జైలు శిక్ష పడింది. బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్ ఏసియా విమానంలో చైనాకు వెళ్లిన వాంగ్(54) ఈ చర్యకు పాల్పడ్డాడు.

chinese police have detained a man for smoking on a Thai AirAsia flight from Bangkok.

విమానంలోని టాయ్‌లెట్‌లో అతను స్మోకింగ్ చేయడంతో.. కేబిన్ లోని మిగతా ప్రయాణికులకు స్మోకింగ్ వాసన తగిలింది. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది కెప్టెన్ కు సమాచారం ఇవ్వడంతో.. సదరు పొగరాయుడు వాంగ్ అని తేల్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిజియాంగ్ ప్రావిన్స్ లోని హంగ్జూ విమానశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు నిబంధనలు పాటించనందుకు అతనికి ఐదు రోజుల జైలు శిక్ష విధించారు.

కాగా, ప్రపంచ పొగాకు ఉత్పత్తుల్లో చైనా ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. సుమారు 300మిలియన్లకు పైగా పొగరాయుళ్లు ఆ దేశంలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+