భారత్ వేడుకలో ఒబామా: కౌంటర్‌గా పాక్ వేడుకల్లో చైనా అధ్యక్షుడు
న్యూఢిల్లీ: భారత దేశంతో అమెరికా సంబంధాలకు కౌంటర్‌గా పాకిస్తాన్, చైనాలు మరింత దగ్గరవుతున్నాయి! భారత గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరైన విషయం తెలిసిందే. ఆ సమయంలో పాకిస్తాన్, చైనా దేశాలు ఈ పర్యటన పైన విభిన్నంగా స్పందించాయి. భారత్, యూఎస్ సంబంధాల పైన చైనా విమర్శలు కూడా గుప్పించింది.
ఇప్పుడు చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ పాకిస్తాన్ మిలటరీ పరేడ్ వేడుకల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. మార్చి 23వ తేదీన పాకిస్తాన్ వార్షిక మిలటరీ పరేడ్ ఉంది. దీనికి జీ జింగ్‌పింగ్ రానున్నారు. ఈ కార్యక్రమం ఇస్లామాబాదులో జరగనుంది. చివరి మిలటరీ పరేడ్ మార్చి 23, 2008లో జరిగింది. అప్పుడు పర్వేజ్ ముషరాఫ్ అధ్యక్షుడిగా ఉన్నారు. భారత్, అమెరికా సంబంధాలకు పోటీగా పాక్ వేడుకల్లో చైనా అధ్యక్షుడు పాల్గొంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా, భారత్‌తో అమెరికా సంబంధాలు బలపడుతుండడంపై చైనా అభద్రతకు గురికావలసిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్న విషయం తెలిసిందే. ఆసియా దేశాల ఎదుగుదలను అడ్డుకోవడానికి పశ్చిమ దేశాలు పన్నిన ఉచ్చులో చిక్కుకుని భారత్ అమెరికాకు మద్దతు ఇవ్వవద్దంటూ.. చైనా అధికార పత్రిక చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
అసలు చైనా ఇటువంటి అనుమానాలను ఎందుకు పెట్టుకుంటుందో అర్థం కావడంలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుని ఇరుదేశాల ప్రజల ఆకాంక్షలను సుసంపన్నం చేయాలన్నది తన అభిమతమన్నారు. వేరొకరికి నష్టం వాటిల్లకుండా కలిసి ముందడుగు వేయాలనే తాను కోరుకుంటానన్నారు.

ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీతో తన చర్చలు కొనసాగాయని ఒబామా చెప్పారు. భారత్‌కు అమెరికా దగ్గరకావడానికి అనేక అంశాలు దోహదపడ్డాయన్నారు. ముఖ్యంగా రెండూ ప్రజాస్వామిక దేశాలన్నారు. ఇరుదేశాల ప్రజల ఆకాంక్షలు ఒకేతీరుగా ఉంటాయని, అమెరికా ప్రజలు ఆలోచించిన విధంగానే భారత ప్రజలు కూడా ఆలోచిస్తారన్నారు. చైనా ఈ రీతిలో స్పందించదన్నారు.
శాంతియుత వాతావరణంలో చైనా అభివృద్ధి చెందితే తాము స్వాగతిస్తామన్నారు. అంతేకానీ ఎదుటి వారి ప్రయోజనాలను దెబ్బతీస్తూ తాము ఎదుగుతామంటే అంగీకరించబోమని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలను బెదిరించి లొంగదీసుకోవడం మాత్రం కుదరదన్నారు.
అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషి చేయాలన్నారు. రష్యా, అమెరికాల మధ్య యుద్ధం వచ్చే అవకాశంలేదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షల కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ యుద్ధం జరిగే ప్రసక్తే లేదన్నారు. రష్యా- అమెరికాల మధ్య యుద్ధం అమెరికాకు ప్రపంచానికి కూడా మంచిది కాదన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగానే రష్యాపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందన్నారు.
-
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications