నెట్ వ్యసనానికి విరుగుడుగా చేయి కోసుకున్న యువకుడు

బీజింగ్: ఇంటర్నెట్ వ్యసనానికి విరుగుడుగా చైనా యువకుడు ఒకతను ఏకంగా చేయినే కోసేసుకున్నాడు. చైనాలోనీ జియాంగ్జు ప్రాంతంలోని యువకుడు ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. వాంగ్ అనే 19 ఏళ్ల యువకుడు ఇంటర్నెట్‌కు బానిసగా మారిపోయాడు. అయితే, ఆ అలవాటును మానుకోవడానికి నానా ప్రయత్నాలు చేశాడు.

కూరగాయలు తరగే కత్తిని వెంట తీసుకుని వాంగ్ ఇంటి నుంచి పారిపోయాడు. ఓ పార్కు బెంచీపై కూర్చుని కత్తితో తన ఎడమ చేతిని కోసేసుకున్నాడు. వెంటనే కాల్ టాక్సీని పిలిచి తనను ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని చెప్పాడు. వైద్యులు చెమటోడ్చి తెగిపోయిన చేతిని తిరిగి అతనికి అతికించారు.

Chinese teen chops hand off to ‘cure’ internet addiction

జరిగిన సంఘటనను అంగీకరించలేమని, ఇది సరైంది కాదని, అతను చాలా మంచి బాలుడని తల్లి అంది. తాను బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తన కుమారుడి పడక గదికి వెళ్లానని, అతను కనిపించలేదని, చేతితో రాసి పెట్టిన ఓ లేఖ కనిపించిందని ఆమె చెప్పింది. తాను ఆస్పత్రికి వెళ్లాలని, ఆందోళన చెందవద్దని, ఈ సాయంత్రం తిరిగి వస్తానని రాశాడు.

చైనాలో ఇంటర్నెట్ వాడకం అంటువ్యాధిలా విస్తరించింది. 2.4 కోట్ల మంది దానికి బానిసలయ్యారు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం, బ్రౌజింగ్ చేయడం వంటి విషయాల్లో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇంటర్నెట్ వ్యసనం నుంచి బయట పడేసేందుకు దేశంలోని చాలా ప్రాంతాల్లో క్లినిక్‌లు ఏర్పాటయ్యాయి. అయినా ఫలితం అంతంత మాత్రంగానే ఉన్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+